Begin typing your search above and press return to search.

సరైనోడితో చిందులేస్తున్న రకుల్..

By:  Tupaki Desk   |   30 Jan 2016 7:57 AM GMT
సరైనోడితో చిందులేస్తున్న రకుల్..
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సరైనోడు తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. తమ అభిమాన నటుడిని క్లాస్ గెటప్ లోని మాస్ అవతారంతో సంబరాలు చేసుకున్నారు.

ప్రస్తుతం సరైనోడు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఏప్రిల్ నాటికి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో.. పనులన్నీ చకచకా కంప్లీట్ చేసేస్తున్నారు. ఇప్పుడీ మూవీలోని ఓ సూపర్బ్ సాంగ్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఏడు ఎకరాల్లో సెట్స్ వేసి పూర్తి చేస్తున్నారు. మూడు బ్రహ్మాండమైన సెట్స్ వేశారని, అన్నీ విజువల్ గా సూపర్బ్ గా ఉంటాయని తెలుస్తోంది. సాంగ్ కూడా మంచి ఫాస్ట్ బీట్ మీద సాగుతోందట. బన్నీ - రకుల్ లు డ్యాన్సుల్లో కుమ్మేశారని తెలుస్తోంది. సరైనోడు సినిమాకి ఈ సాంగ్ అదనపు అడ్వాంటేజ్ అవుతుందని చెబుతున్నారంటే.. సాంగ్ ఎంత బాగా వస్తోందో అర్ధమవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు కేథరిన్ థ్రెసా కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎమ్మెల్యే రోల్ లో కేథరిన్ కనిపించనుంది.

సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా సరైనోడులో యాక్ట్ చేస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్ రోల్ లో కనిపించనున్నాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా తాజాగా పూర్తైపోయాయి. బోయపాటి మాస్ మార్క్, బన్నీ హ్యాట్రిక్ హిట్స్ తో ఊపు మీద ఉండడంతో.. అన్ని ఏరియాల్లోనూ మంచి రేట్ వచ్చినట్లు తెలుస్తోంది.