Begin typing your search above and press return to search.

సమంతను ట్రోల్‌ చేస్తున్న బన్నీ - మహేష్‌ ఫ్యాన్స్‌

By:  Tupaki Desk   |   10 Dec 2020 8:51 AM IST
సమంతను ట్రోల్‌ చేస్తున్న బన్నీ - మహేష్‌ ఫ్యాన్స్‌
X
గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ మరియు మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ కూడబలుక్కుని మరీ సమంతను ట్రోల్స్‌ చేస్తున్నారు. వారి ట్రోలింగ్‌ తో సమంతకు చిరాకు తెప్పిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ట్విట్టర్‌ మరియు ఇన్‌ స్టా గ్రామ్‌ ల వేదికగా సమంతను ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ విమర్శలు చేస్తూనే ఉన్నారు. గతంలో ఆ ఇద్దరు హీరోలతో నటించిన సమంత ఇప్పుడు ఆ ఇద్దరు హీరోల అభిమానుల దాటికి చిరాకు పడుతుంది. ఇంతకు సమంతను ఆ ఇద్దరు హీరోల అభిమానులు ఇంతగా ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటీ అంటే ఒక చిన్న ట్వీట్‌. సమంత చేసిన ఆ ట్వీట్‌ వారం రోజులుగా మహేష్‌.. అల్లు అర్జున్‌ అభిమానుల కోపంకు కారణం అవుతుంది.

సమంత వారం రోజుల క్రితం ఆకాశమే నీ హద్దురా సినిమా ను చూసి దానిపై తన స్పందన రాసింది. ఆమెకు కాస్త ఎక్కువగా నచ్చిందో ఏమో కాని మూవీ ఆఫ్‌ ది ఇయర్‌ అంటూ కాస్త గట్టిగానే ఆ సినిమాను సమర్థిస్తూ ప్రశంసిస్తూ ట్వీట్‌ చేసింది. ఈ ఏడాదిలో విడుదల అయిన అన్ని సినిమాల్లోకి సమంత దృష్టిలో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా టాప్‌ లో ఉందన్నమాట. ఇదే మాట మహేష్‌ బాబు మరియు అల్లు అర్జున్‌ ల అభిమానులకు మింగుడు పడలేదు.

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన అల వైకుంఠపురంలో మరియు సరిలేరు నీకెవ్వరు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచాయి. వసూళ్ల పరంగా కూడా ఆ సినిమాలు ది బెస్ట్‌ అన్నట్లుగా నిలిచాయి. ఆ సినిమాలు నీకు కనిపించలేదు కాని తమిళ సినిమా మాత్రమే కనిపించిందా అంటూ కొందరు ట్రోల్‌ చేస్తున్నారు. మరి ఈ ట్రోల్‌ కు సమంత ఎలా సమాధానం చెబుతుంది అనేది చూడాలి.