Begin typing your search above and press return to search.
పార్టీ బిల్లులపై స్టార్ హీరో హర్టయ్యాడట!
By: Tupaki Desk | 7 Feb 2020 9:56 AM ISTసినిమా రిలీజై సక్సెసైతే ఆ హుషారే వేరుగా ఉంటుంది. ఆ హుషారులో రకరకాల పార్టీలు ఉంటాయి. అంతెందుకు ప్రీరిలీజ్ వేడుకల సమయం లోనే ఓ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు మన అగ్ర హీరోలు. చిత్రయూనిట్ సహా పలువురు టాప్ గెస్ట్స్ కి కచ్ఛితంగా విందు ఏర్పాటు ఉంటోంది. ఇక సక్సెస్ అయిన తర్వాత అయితే పరిశ్రమ ప్రముఖుల్లో ఎవరినీ వదిలి పెట్టకుండా పార్టీకి ఆహ్వానిస్తున్నారు. ఇక ఈ పార్టీ బిల్లు కూడా అంతే పెద్ద మొత్తం లో తేలుతోందన్నది ఇన్ సైడ్ గుసగుస.
అసలే వైన్ అండ్ డైన్ పార్టీలు.. పైగా స్టార్ హోటల్ బిల్లులు.. దీంతో నిర్మాతలకు వాచిపోతోందట. లక్షలాది రూపాయలు ఇలాంటి పార్టీలకు వెచ్చించాల్సి రావడంతో ఆ మొత్తం ఎటు పోతోందోనన్న బెంగ కూడా ఇలాంటప్పుడు బయట పడుతుంటుంది. చేతిచమురు వదిలేకొద్దీ బెంగ పెరుగుతుంటుంది. అయితే ఆ స్టార్ హీరో సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టాక చేసిన పార్టీలు.. అంతకు ముందు పార్టీలు మొత్తానికి తన చేతి చమురు వదిలించుకోకుండా భాగస్వామ్య నిర్మాత పై బాదాడన్న గుసగుస ఇటీవల పరిశ్రమ వర్గాల్లో వేడెక్కించింది.
అయితే తాను తన తండ్రి కూడా ఆ సినిమా లో నిర్మాణ భాగస్వాములు అయ్యి ఉండీ.. పార్టీల బిల్లులు కేవలం వేరొక నిర్మాతపైనే రుద్దేస్తే ఎలా? కలిసే భరించాలి కదా! అన్న లాజిక్ ని కూడా నెటిజనులు ప్రస్తుతం ఆడేసుకుంటున్నారు. అయితే అసలు ఇది ఒక రూమర్ గా ఎలా స్ప్రెడ్ అయ్యిందో తెలీదు కానీ.. దీనిపై సదరు స్టార్ హీరో హర్టయ్యారట. తాము నిర్మాతలం అయ్యి ఉండీ అలా ఎందుకు చేస్తాం? ఆ మాత్రం బాధ్యత మాకు తెలీనిదా? ఇదంతా కావాలని చేస్తున్న ప్రత్యర్థి ప్రచారం అంటూ ఒకటే ఇదయ్యారట. నిజమే.. నిర్మాతల హీరోగా కష్టం సుఖం తెలిసిన సదరు స్టార్ హీరో అలా ఎందుకు చేస్తారు? పైగా ఎదుటి వాళ్లు సక్సెసైతే తానే పిలిచి పార్టీ ఇచ్చే టైపు. అలా ఎందరికో అందరి వాడు అయ్యాడు ఆ స్టార్ హీరో. మరి తాజా రూమర్ విషయంలో నిజం ఎంతో భాగస్వామ్య నిర్మాతనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చేతి చమురు వదిలిందన్న భావన ఆయనలో లేనప్పుడు నిజం చెప్పాలి కదా? అని మరో ప్రశ్న వేస్తున్నారు నెటిజనులు. ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరో ఎవరు? సినీ నిర్మాణ భాగస్వామి ఎవరో మీరే గెస్ చేయొచ్చు.