Begin typing your search above and press return to search.
రామానాయుడు స్టూడియోస్ ని కొట్టేసే రేంజ్ లోనా?
By: Tupaki Desk | 3 Oct 2020 2:40 PM ISTసోషల్ మీడియా ప్రభావం పెరిగిన దగ్గరి నుంచి ప్రతీదీ ప్రత్యేకంగా ప్రచారం చేసుకునే వెసులు బాటు కలుగుతోంది. ఇక స్టార్ ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి అంశాన్ని అభిమానులతో నేరుగా పంచుకునే వీలుంటోంది. దీంతో తమకు సంబంధించిన ప్రతీ ఈవెంట్ ని ఆడియన్స్ కి తెలిసేలా సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు.
స్టార్ హీరో బన్నీకూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. తనకు సంబంధించిన ప్రతీ టాపిక్... ఈవెంట్ మీడియా వార్తల్లో నానేలా చొరవ చూపిస్తున్నారు. ఇటీవల పద్మశ్రీ అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఫ్యామిలీ అంతా కలిసి ఆయనపైరుతో ఓ స్టూడియోని నిర్మిస్తున్నామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. `అల్లు స్టూడియోస్` పేరుతో ఈ స్టూడియోని నిర్మించబోతున్నారు.
దీనికి సంబంధించిన పూజా సెర్మనీ ఇటీవల హైదరాబాద్ లో స్టూడియో నిర్మాణం కోసం ఎంపిక చేసిన ఎకరాల స్థలంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు ఫ్యామిలీ హీరోలు బన్నీ.. శీరిష్ తో పాటు అల్లు అరవింద్... అల్లు వెంకటేష్.. ఫ్యామిలీ మెంబర్స్ అంతా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోని బన్నీ అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇంతకీ అల్లు స్టూడియోస్ ఏ రేంజులో ఉండబోతోంది? అంటే టాలీవుడ్ టాప్ వన్ రేంజులో డిజైన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో రామానాయుడు స్టూడియోస్.. అన్నపూర్ణ స్టూడియోస్.. పద్మాలయా స్టూడియోస్.. సారథి స్టూడియోస్ వున్నాయి. వీటికి ధీటుగా సరికొత్త హంగులతో `అల్లు స్టూడియోస్`ని నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. టీవీ సీరియల్స్.. రియాలిటీ షోస్..., భారీ చిత్రాల నిర్మాణానికి అనువుగా అల్లు స్టూడియోస్ ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దాలని బన్నీ ప్లాన్ చేస్తున్నారని ఫిలింనగర్ వర్గాల టాక్. రామానాయుడు స్టూడియోస్ ని కొట్టేసే రేంజ్ లో ఈ స్టూడియో వుండేలా ప్లాన్ చేస్తున్నారట. దీనికి బన్నీ ప్లానింగ్ పెద్ద రేంజులోనే ఉందిట.