Begin typing your search above and press return to search.

బన్నీ.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశాడా?

By:  Tupaki Desk   |   2 Oct 2015 10:17 AM IST
బన్నీ.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశాడా?
X
బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టెయినర్ చేస్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే సగానికి పైగా టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. బన్నీ సరసన రకుల్ ప్రీత్ చేయబోతున్న రొమాన్స్.. ఈ మూవీకి కీలకంగా తెలుస్తోంది.

యాక్షన్ మూవీస్ ని పర్ఫెక్ట్ గా తెరకెక్కించే బోయపాటి.. తొలిసారిగా రొమాన్స్ ని వడ్డించబోతున్నాడు. తాను లవ్ స్టోరీలను ఎంత పర్ఫెక్ట్ గా తెలియచెప్పడానికి బాగా తపన పడుతున్నాడు బోయపాటి. అయితే ఆయన మార్క్ యాక్షన్ కూడా ఫుల్లుగానే ఉంటుందని తెలుస్తోంది. శ్రీకాంత్ ఓ కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీలో... ఆది పినిశెట్టి విలన్ గా తీసుకున్నారు. నెగిటివ్ పాత్రకు మరో హీరోని తీసుకున్నారంటేనే.. ఈ మూవీని ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో అర్ధమవుతుంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాని... ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు అల్లు అరవింద్. సంక్రాంతి సినిమాల హడావిడి అయిపోగానే.. బన్నీ మూవీ సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. సెన్సేషల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.