Begin typing your search above and press return to search.

అఖండ.. పుష్ప రాజ్ ల 'అన్‌ స్టాపబుల్‌'

By:  Tupaki Desk   |   21 Dec 2021 12:30 PM GMT
అఖండ.. పుష్ప రాజ్ ల అన్‌ స్టాపబుల్‌
X
నందమూరి బాలకృష్ణ అన్‌ స్టాపబుల్‌ షో బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ తో దూసుకు పోతుంది. ఇప్పటికే బాలయ్య టాక్ షో లో మోహన్‌ బాబు.. నాని.. బ్రహ్మానందం మరియ అనీల్ రావిపూడి.. అఖండ టీమ్ ఇంకా ఆర్ ఆర్ ఆర్‌ దర్శకుడు రాజమౌళి ఇంకా కీరవాణిలు పాల్గొన్నారు. ఇప్పటికే మహేష్ బాబుతో ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ఇటీవలే రవితేజ తో కూడా ఎపిసోడ్‌ ను చిత్రీకరించడం జరిగింది. ఆ రెండు ఎపిసోడ్‌ లు ఎప్పుడు స్ట్రీమింగ్‌ అయ్యేది క్లారిటీ లేదు. ఈ వారం క్రిస్మస్ సందర్బంగా స్టైలిష్ స్టార్‌.. ఐకానిక్ స్టార్‌ అల్లు అర్జున్ తో అన్‌ స్టాపబుల్‌ ఉండబోతుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌ ను చిత్రీకరించారు. పుష్ప ప్రమోషన్ లో భాగంగా ఇప్పుడు స్ట్రీమింగ్‌ చేసేందుకు సిద్దం చేశారు. బాలయ్య అఖండ సినిమా కు అల్లు అర్జున్ గెస్ట్‌ గా వెళ్లిన విషయం తెల్సిందే. ఆ సమయంలోనే ఈ ఎపిసోడ్‌ ను షూట్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

క్రిస్మస్ కు ఆహా ఓటీటీ ప్రేక్షకులకు ఖచ్చితంగా బన్నీ అన్‌ స్టాపబుల్ ఎపిసోడ్ ఒక మంచి ఎంటర్ టైన్ మెంట్‌ ను అందిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. తాజాగా ఈ ఎపిసోడ్‌ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. రేపు లేదా ఎల్లుండి ప్రోమో కూడా రిలీజ్ చేస్తారు. ఇద్దరి మద్య ఏ విషయాలు ప్రస్థావనకు వచ్చాయి.. బన్నీతో పాటు ఇంకా ఎవరైనా ఈ ఎపిసోడ్‌ లో కనిపించబోతున్నారా అనేది తెలియాలి అంటే ప్రోమో రావాల్సిందే. వీరిద్దరిని అఖండ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో కలిపి చూసినప్పుడు అభిమానులు ఫుల్‌ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు వీరిద్దరు కలిసి అన్‌ స్టాపబుల్‌ లో సందడి చేయబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మంచి ఆధరణ ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

అఖండ సినిమా విడుదల అయిన రెండు వారాలకు పుష్ప రాజ్ సినిమా విడుదల అయ్యింది. రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాదిలో భారీ వసూళ్లను దక్కించుకున్న సినిమాల జాబితాలో వీరిద్దరి సినిమాలు నిలిచాయి. కనుక ఆ సంతోషాన్ని కూడా వీరిద్దరు ఇలా షేర్‌ చేసుకోనున్నారు. వీరి అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఈ ఎపిసోడ్‌ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప రాజ్ మరియు అఖండ ల అన్ స్టాపబుల్‌ ఎపిసోడ్‌ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి. బాలయ్య తన గెస్ట్‌ లు అందరితో చిల్ అన్నట్లుగా చిట్‌ చాట్‌ చేస్తున్నాడు. బన్నీ తో ఎపిసోడ్‌ కూడా ఖచ్చితంగా మంచి ఎంటర్‌ టైన్మెంట్ ను అందించే విధంగా ఉంటుందని ఆహా ప్రేక్షకులు నమ్ముతున్నారు.