Begin typing your search above and press return to search.

వావ్.. అర్జున్ కొడుకు కూడా అర్జున్

By:  Tupaki Desk   |   3 Jan 2018 6:28 PM GMT
వావ్.. అర్జున్ కొడుకు కూడా అర్జున్
X
ఒక నటుడు తండ్రీ కొడుకులుగా డబుల్ యాక్షన్ చేయడం మన దగ్గర కొత్తేమీ కాదు. ఒకరిద్దరు మినహాయిస్తే.. దాదాపు స్టార్ హీరోలు అంతా ఈ తరహాగా ప్రయత్నాలు చేసేసిన వారే. ఇప్పుడు మాత్రం ఓ విచిత్రమైన సిట్యుయేషన్ ఎదురవుతోంది. అర్జున్ అనగానే.. అల్లు అర్జున్ గుర్తొచ్చేయడంలో ఆశ్చర్యం లేదు.

నా పేరు సూర్య అంటూ బన్నీ హీరోగా ఓ మూవీ రూపొందుతోంది. రీసెంట్ గా ఇచ్చిన ఫస్ట్ ఇంపాక్ట్ మరీ పవర్ ఫుల్ గా ఉంది. ఈ టీజర్ లో హీరోనే హైలైట్ చేయగా.. ఇతర క్యారెక్టర్లు ఒకటి రెండు ఫ్రేమ్ లకే సరిపోయాయి. వీటిలో అసలు చూపించని ఫేస్ కూడా ఒకటి ఉంది. అదే హీరో తండ్రి పాత్ర. అసలు టీజర్ లో ఆ ప్రస్తావన కూడా ఎక్కడా రాలేదు కానీ.. సినిమాలో మాత్రం ఈ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. తండ్రీ కొడుకులు మధ్య రిలేషన్ మూవీ హైలైట్స్ గా నిలుస్తుందట. ఇక్కడ కొడుకు పాత్రలో నటిస్తున్నది అల్లు అర్జున్ అనే సంగతి అర్ధమవుతూనే ఉంది. మరి తండ్రి పాత్రను ఎవరు చేస్తున్నారన్నదే ఆసక్తికరం.

ఈ రోల్ చేస్తున్న వ్యక్తి అర్జున్. అంటే అల్లు అర్జున్ కాదులెండి.. సీనియర్ హీరో అర్జున్. గతంలో చాలానే సినిమాల్లో హీరోగా మెప్పించిన కరాటే వీరుడు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటిస్తున్నాడు. రీసెంట్ గా లై చిత్రంలో విలన్ గా నటించగా.. ఇప్పుడు హీరో తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. తొలిసారిగా ఇలా హీరో తండ్రి పాత్రలో అర్జున్ నటిస్తుండగా.. ఈ పాత్రకు కొడుకు రోల్ లో నటిస్తున్న యాక్టర్ పేరు కూడా అర్జున్ కావడమే హైలైట్.