Begin typing your search above and press return to search.

374 సార్లు బన్నీ అడిగినదానికి 'నో' చెప్పిన అల్లు అర్హ..!

By:  Tupaki Desk   |   13 Jun 2020 5:30 AM GMT
374 సార్లు బన్నీ అడిగినదానికి నో చెప్పిన అల్లు అర్హ..!
X
అల్లు అర్జున్ - స్నేహారెడ్డి దంపతుల పిల్లలు అల్లు అయాన్ మరియు అర్హ చిన్న వయసులోనే బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ స్టార్ కిడ్స్ కి సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు. వీరిద్దరికి సంబంధించిన విశేషాలను.. వారు చేసే అల్లరి వీడియోలను బన్నీ - స్నేహ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. ఇటీవల అర్హ 'బుట్టబొమ్మ' పాటకి లిప్ రీడింగ్ ఇచ్చిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్య పెళ్లిపై తండ్రీ కూతుళ్ల చిట్ చాట్ వీడియోను కూడా స్నేహ షేర్ చేసింది.

ఇప్పుడు లేటెస్టుగా అల్లు అర్జున్ తన గారాలపట్టి అర్హ కు సంభందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేసాడు. ఈ వీడియోలో అల్లు అర్జున్ తాను చూపించిన వాడిని పెళ్లి చేసుకుంటావా అని అడుగగా.. అల్లు అర్హ ''చేసుకోను'' అని సమాధానం చెప్పింది. ''అర్హలు.. నా బుజ్జి తల్లులు.. నువ్వు నా బంగారు తల్లి.. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా నానా.. ఏంటి చేసుకుంటావా చేసుకోవా..?'' అని గారాబంగా అడుగగా ''ఊహు.. నేను చేసుకోను'' అంటూ నవ్వుతూ అర్హ పరుగులు తీసింది. అటెంప్ట్ నెంబర్ #374.. 'నానా ట్రయల్స్' అని క్యాప్షన్ పెట్టిన బన్నీ ఇప్పటికి 374 సార్లు ప్రయత్నించానని చెప్తున్నాడు. ఇప్పుడు అర్హ - బన్నీల ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బన్నీ చిలిపి ప్రశ్నలు అర్హ క్యూట్ సమాధానం అందరికి నవ్వులు తెప్పిస్తున్నాయి.

కాగా అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని అందరికి తెలిసిందే. ఇప్పుడు లాక్‌ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండిపోవడంతో కుటంబ సభ్యులతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ముఖ్యంగా తన ఇద్దరు పిల్లలతో ఆడుకుంటున్నాడు. వారితో సరిదాగా గడపుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. తనయుడు అల్లు అయాన్ బర్త్ డేని కూడా నిరాడంబరంగా కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసాడు బన్నీ. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమాలో నటిస్తున్నాడు.