Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ స్టేజీ మీద స్టెప్పేస్తే..

By:  Tupaki Desk   |   2 July 2016 10:00 AM IST
అల్లు అర్జున్ స్టేజీ మీద స్టెప్పేస్తే..
X
చాలాసార్లు ఇక్కడ టాలీవుడ్‌ లో స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ స్టేజీ మీద స్టెప్పులు వేశాడులే. అసలే మనోడు టాప్‌ డ్యాన్సర్లలో ఒకడు కాబట్టి.. ఖచ్చితంగా ఉర్రూతలూగించేస్తాడు. అయితే సడన్‌ గా ఎవరైనా పిలిచి ఓ నాలుగు స్టెప్పులు వేయి నాయనా అంటే మనోడు కనక్ట్ అవుతాడా? అయిపోయాడంతే.

గత రాత్రి జరిగిన సైమా 2016 అవార్డుల 2వ రోజు వేడుకలో.. తమిళ మరియు మలయాళ పరిశ్రమలకు అవార్డులు అందించారు. తొలిరోజున ఎలాగైతే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ రచ్చ లేపేశాడో.. రెండో రోజు అదే జోష్‌ తో అనిరుథ్‌ కూడా చంపేశాడు. ఒక్కసారిగా మనోడి మెలోడీలకూ.. బీభత్సమైన స్ర్టింగ్‌ మ్యూజిక్ కు ఆడిటోరియమ్ ఉర్రూతలూగిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఇలాంటి బెస్టు పాటలకు బెస్టు డ్యాన్సర్ తోడవ్వాలి అనుకున్నాడేమో తెలియదు కాని.. క్రిందకు వెళ్ళి బన్నీ ను పైకి లాక్కొచ్చేశాడు కొలవెరి కుర్రాడు. వెంటనే ఓ రెండు పాటలకు స్టెప్పులు వేయించాడు.

బన్నీ ఏమన్నా తగ్గుతాడా.. మనోడు కూడా అనిరుద్‌ ఊహించిన రేంజులోనే చంపేశాడు. తను అలా మూమెంట్లు చేస్తూ ఉంటే.. క్రింద కూర్చున్న సెల్రబిటీలందరూ ఉర్రూతలూగిపోయారు అనుకోండి. ఏదేమైనా బన్నీ లాంటి ఎనర్జెటిక్‌ డ్యాన్సర్లు స్టేజీ మీద సినిమా చూపిస్తుంటే ఆ కిక్కేవేరబ్బా!!