Begin typing your search above and press return to search.

సమంత ఏది కాదనకుండా చేసింది

By:  Tupaki Desk   |   13 Dec 2021 8:30 AM GMT
సమంత ఏది కాదనకుండా చేసింది
X
అల్లు అర్జున్‌.. సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందిన పుష్ప సినిమా లో సమంత ఐటెం సాంగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. మొదట ఈ పాట ఏంటీ ఇలా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కాని మెల్ల మెల్లగా పాట జనాల్లోకి ఎక్కేస్తోంది. సినిమా విడుదల తర్వాత పాట మరింతగా ఊపేయడం ఖాయం అంటూ అభిమానులు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమా లోని సమంత ఐటెం సాంగ్ ప్రధాన ఆకర్షణ గా నిలుస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. రష్మిక హీరోయిన్ గా నటించగా సమంత ఐటెం సాంగ్‌ చేయడంతో సౌత్‌ లో ఈ సినిమా మోస్ట్‌ క్రేజీ మూవీగా మారిపోయింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సమంత ఈ సినిమా కు ఐటెం సాంగ్‌ చేయడంకు కమిట్ అయ్యిందనే వార్తే పెద్ద సంచలనంగా నిలువగా.. పాట విడుదల తర్వాత ఇలాంటి పాటలో సమంత కనిపించబోతుండటం మరింత చర్చనీయాంశంగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సమంత ఐటెం సాంగ్ గురించి అల్లు అర్జున్‌ తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా మాట్లాడాడు. పుష్ప ప్రీ రిలీజ్ వేదిక మీదునుండి సమంతకు అల్లు అర్జున్‌ కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రత్యేక గీతాల్లో నటించేందుకు హీరోయిన్స్ కొన్ని పరిమితులు పెట్టుకుంటారు. కాని సమంత గారు మాత్రం మమ్ముల నమ్మినా నమ్మకున్నా మేము ఏది అడిగితే అది వచ్చి చేశారు.. ఆమె తనకు అప్పగించిన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించి వెళ్లారు. అందుకే ఆమెకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను అంటూ బన్నీ చెప్పకొచ్చాడు.

సమంత ఐటెం సాంగ్స్ చేయడం మొదలు పెట్టడంను కొందరు అభిమానులు విమర్శిస్తుంటే ఎక్కువ శాతం అభిమానులు మాత్రం స్వాగతిస్తున్నారు. హీరోయిన్‌ అన్నప్పుడు పరిమితులు ఉండకూడదు.. అన్ని రకాల పాత్రల్లో పాటల్లో నటించాలి. అప్పుడే నటిగా గుర్తింపు వస్తుందని అంటారు. బాలీవుడ్‌ లో ఇప్పటికే టాప్‌ స్టార్‌ హీరోయిన్స్ అంతా కూడా ఐటెం సాంగ్స్ చేశారు. సౌత్‌ లో కూడా ఆ పద్దతి మొదలు అయ్యింది. పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమా లోని సమంత ఐటెం సాంగ్ సినిమా అంచనాలు మరింతగా పెంచాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.