Begin typing your search above and press return to search.

క‌ళ్యాణ్ రామ్ అంటే గౌర‌వం!- అల్లు అర్జున్

By:  Tupaki Desk   |   7 Aug 2022 11:44 AM GMT
క‌ళ్యాణ్ రామ్ అంటే గౌర‌వం!- అల్లు అర్జున్
X
టాలీవుడ్ హీరోగా నిర్మాత‌గా నందమూరి కళ్యాణ్ రామ్ రాజీ లేని ప్ర‌యోగాల గురించి తెలిసిందే. గ‌ట్సీ నిర్మాత ఇప్పుడు మ‌రోసారి `బింబిసార`తో అలాంటి ప్ర‌యోగ‌మే చేశాడు క‌ళ్యాణరాముడు. ఇందులో ప్రయోగాత్మ‌క పాత్ర‌తో అద‌ర‌గొట్టాడు.

ఈ చిత్రం ఇటీవ‌లే విడుద‌లై క్రిటిక్స్ నుంచి సామాన్య ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటోంది. క‌ళ్యాణ్ రామ్ న‌ట‌న డెబ్యూ డైరెక్ట‌ర్ ప్ర‌తిభ‌ను కొనియాడ‌ని వారు లేరు. మూవీ బాక్సాఫీస్ వద్ద వ‌సూళ్ల ప‌రంగానూ దూసుకుపోతోంది. నూతన దర్శకుడు వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ పీరియాడిక్ ఫాంటసీ యాక్షన్ డ్రామాని నిర్మించింది.

వ‌రుస‌గా సెల‌బ్రిటీలు ఈ మూవీ ప్రివ్యూలు వీక్షించి ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా చూసిన తర్వాత టీమ్ మొత్తాన్ని అభినందించారు. బింబిసార బృందం పై తన ట్విట్టర్ హ్యాండిల్ లో ప్ర‌శంస‌లు కురిపించాడు. క‌ళ్యాణ్ రామ్ అంటే త‌న‌కు ఎంతో గౌర‌వ‌మ‌ని బ‌న్ని వ్యాఖ్యానించ‌డం కొస‌మెరుపు.

``#బింబిసార బృందానికి బిగ్ విషెస్.. చాలా ఆసక్తికరమైన ఆకర్షణీయమైన ఫాంటసీ చిత్రమిది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ గారి ప్రభావవంతమైన ఉనికిని చాటింది. ఎప్పుడూ కొత్త టాలెంట్ ని ఇండస్ట్రీలోకి తీసుకువస్తూ కొత్త తరహా సినిమాలను ట్రై చేస్తున్నందుకు ఆయనంటే నాకు గౌరవం. దీన్ని బాగా హ్యాండిల్ చేసినందుకు డెబ్యూ డైరక్టర్ వ‌శిష్ట‌ను నేను అభినందిస్తున్నాను. టెక్నీషియన్స్- ఆర్టిస్టులందరికీ అభినందనలు. ఎంఎం కీర‌వాణి గారు కేథ‌రిన్ థ్రెసా.. సంయుక్త‌.. NTR ఆర్ట్స్ అంద‌రికీ.. ఈ చిత్రం అన్ని వయసుల వారికి వినోదం అందిస్తుంది`` అని అల్లు అర్జున్ బింబిసారను ప్రశంసించారు.

మెగాస్టార్ చిరంజీవి - అల్లు అర్జున్ స‌హా ప‌లువురు టాప్ స్టార్లు క‌ళ్యాణ్ రామ్ బింబిసార‌ను ప్ర‌శంసించ‌డం ఈ సినిమా ప‌బ్లిసిటీకి కూడా పెద్ద ప్ల‌స్ కానుంది. మునుముందు ఈ చిత్రానికి క‌లెక్ష‌న్లు పెరిగేందుకు ఆస్కారం ఉంది. ఈ వీకెండ్ లో చ‌క్క‌ని వ‌సూళ్లు సాధించి తొలి వారంలో వ‌సూళ్ల‌ను పెంచుకుంటే.. బ్రేక్ ఈవెన్ సాధించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. ఈ విజ‌యంతో క‌ళ్యాణ్ రామ్ మ‌రిన్ని ప్ర‌యోగాత్మ‌క సినిమాల్ని తెర‌కెక్కించేందుకు ఊత‌మిచ్చిన‌ట్ట‌వుతుంది.