Begin typing your search above and press return to search.

AMB సినిమాస్ ని కొట్టేలా బ‌న్ని AAA సినిమాస్!

By:  Tupaki Desk   |   23 March 2021 4:54 AM GMT
AMB సినిమాస్ ని కొట్టేలా బ‌న్ని AAA సినిమాస్!
X
టాలీవుడ్ అగ్ర హీరోలు మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ రంగంపై ఆస‌క్తిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కార్పొరెట్ సంస్థ‌ల‌తో క‌లిసి సొంతంగా స్క్రీన్ల ఏర్పాటు కోసం పోటీప‌డుతున్నారు. ఇప్ప‌టికే మ‌హేష్ ఏషియ‌న్ సినిమాస్ తో క‌లిసి AMB సినిమాస్ చెయిన్ ని ప్రారంభించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనూ ఏషియ‌న్ సినిమాస్ మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్ల వృద్ధికి కృషి చేస్తోంది. ఎవిడి సినిమాస్ తన సొంత పట్టణం మహబూబ్ నగర్ లో సిద్ధమవుతోంది.

మ‌రోవైపు డార్లింగ్ ప్ర‌భాస్ సొంతంగా నెల్లూరులో మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌ను ప్రారంభించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రంగంలో త‌న‌దైన మార్క్ ని చూపించేందుకు త‌పిస్తున్నార‌ని తెలిసింది. ఏషియ‌న్ సినిమాస్ సహకారంతో అల్లు అర్జున్ AAA సినిమాస్ (ఏసియా అల్లు అర్జున్ సినిమాస్) కి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.

ఈ మల్టీప్లెక్స్ ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉంది. అమీర్ పేట్ స‌త్యం థియేట‌ర్ ని సొంతం చేసుకుని ఆ స్థ‌లంలోనే ఏఏఏ సినిమాస్ ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం బన్నీ ఫోటోతో AAA సినిమా లోగో సోషల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇది పూర్తి కావడానికి ఆరు నెల‌ల నుంచి ఏడాది పట్టవచ్చని తెలుస్తోంది. అమీర్ పేట్ ప‌రిస‌రాల్లోనే అత్యంత విలాస‌వంత‌మైన భ‌వంతిని నిర్మిస్తున్నార‌ని తెలుస్తోంది.

స్టైలిష స్టార్ అన్న ఇమేజ్ కి త‌గ్గ‌ట్టే AAA సినిమాస్ ని స్టైలిష్ ‌గా తీర్చిదిద్దాలని భారీ మొత్తాన్ని వెచ్చించార‌ట‌. ఏఎంబి సినిమాస్... ఏవిడి సినిమాస్ ల‌ను త‌ల‌ద‌న్నేలా ఏఏఏ సినిమాస్ సౌక‌ర్యాలు అబ్బుర‌ప‌రుస్తాయ‌ని చెబుతున్నారు. ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే బ‌న్ని పుష్ప చిత్రీక‌ర‌ణ‌లో బిజీ. ఆ త‌ర్వాతా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తారు.