Begin typing your search above and press return to search.

బన్నీ తర్వాతి సినిమా టైటిల్ అదేనా?

By:  Tupaki Desk   |   19 Jan 2020 5:12 AM GMT
బన్నీ తర్వాతి సినిమా టైటిల్ అదేనా?
X
దారుణ పరాజయం పలుకరించిన తర్వాత వెంటనే సినిమాలు చేయకుండా.. ఏడాదిన్నరకు పైనే గ్యాప్ తీసుకొని.. కసిగా తీసిన అల వైకుంఠపురము చిత్రంతో సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు బన్నీ. ఈ మూవీ తాజా విజయంతో మాంచి హుషారులో ఉన్నారు బన్నీ. ఈ సినిమా విడుదలకు ముందు తన గ్యాప్ గురించి పదే పదే మాట్లాడిన ఆయన.. ఇప్పుడా ప్రస్తావనే తేవటం లేదు. అదే సమయంలో.. ఆయన చేసే సినిమాలకు సంబంధించిన వార్తల జోరు అంతకంతకూ పెరుగుతోంది.

తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ సినిమాలో నటించనున్న బన్నీ.. తర్వలో షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి శేషాచలం టైటిల్ ను సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. కథకు సరిపోలే ఈ టైటిల్ ను కన్ఫర్మ్ చేయాలన్న ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. బన్నీ చేస్తున్న ఇరవయ్యో సినిమా మీద భారీ అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మూవీలో ప్రముఖ యాంకర్ కమ్ నటి అనసూయ కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. అయితే.. ఆమె నటించే పాత్ర ఏమిటి? ఎలా ఉంటుందన్న విషయాన్ని మాత్రం రివీల్ చేయటం లేదు. కాకుంటే సినిమాలో ఆమెది కీ రోల్ అని మాత్రం చెబుతున్నారు. రంగస్థలంలో రంగమ్మత్తగా ఇరగదీసిన అనసూయ.. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.