Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ 21.. అందుకే ఆగిపోయిందా??

By:  Tupaki Desk   |   21 April 2021 12:30 PM GMT
అల్లు అర్జున్ 21.. అందుకే ఆగిపోయిందా??
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు పూర్తయ్యే స్టేజిలో ఉందట. అయితే కొరటాల తదుపరి సినిమా విషయంలో ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. నిజానికి కొరటాల ఆచార్య సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమా అల్లు అర్జున్ కు 21వది అయ్యేది. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. కానీ చివరిగా ఏమైందో గాని అల్లు అర్జున్ తో కొరటాల సినిమా ఆగిపోయింది. ఆ వెంటనే డైరెక్టర్ కొరటాల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ప్రకటించాడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నాడు కొరటాల.

మరి అసలు అల్లు అర్జున్ సినిమా ఎందుకు కుదరలేదు.. అనే ప్రశ్నకు సమాధానం మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటంటే.. కొరటాల అల్లు అర్జున్ కోసం స్టోరీ లైన్ మాత్రమే సిద్ధం చేసాడట. ఇంకా అసలు స్క్రిప్ట్ వైపు వెళ్లలేదని టాక్. ప్రస్తుతం కొరటాల ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో సినిమా మరి కొద్దీరోజుల్లో ప్రారంభం కాబోతుందట. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే తాజాగా బన్నీ సినిమా సంగతేంటనే దానికి వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా ప్రారంభం చేయనున్నట్లు సినీ వర్గాలలో టాక్. ఈ విషయాన్నీ నిర్మాత మిక్కిలినేని సుధాకర్ చెప్పినట్లు తెలుస్తుంది. చూడాలి మరి జనతాగ్యారేజ్ కాంబినేషన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో..!