Begin typing your search above and press return to search.

`శాకుంత‌లం`లో అల్లు అర్హ పార్ట్ పూర్తి.. వీడ్కోలు పార్టీలో చిత్ర‌బృందం ఛీర్స్!

By:  Tupaki Desk   |   10 Aug 2021 5:30 AM GMT
`శాకుంత‌లం`లో అల్లు అర్హ పార్ట్ పూర్తి.. వీడ్కోలు పార్టీలో చిత్ర‌బృందం ఛీర్స్!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌ట‌వార‌సురాలు అల్లు అర్హ బాల న‌టిగా తెరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ట్రీలో ఎంద‌రినో బాల‌న‌టులుగా ప‌రిచ‌యం చేసిన సీనియ‌ర్ ద‌ర్శ‌కులు గుణ‌శేఖ‌ర్ అర్హ‌ను కూడా తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. అతడు తెర‌కెక్కిస్తున్న శాకుంత‌లం చిత్రంలో క్యూట్ అర్హ బాల‌న‌టిగా మెర‌వ‌నుంది.

ఇప్ప‌టికే అర్హ పై పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఆరేడు రోజుల క్రితం శాకుంతలం బృందం అర్హకు అలంకరించిన సెట్లు బెలూన్ల మెరుపుల న‌డుమ‌ ఘ‌న‌స్వాగతం పలికింది. తొలి రోజు చిత్రీక‌ర‌ణ‌కు బ‌న్ని -స్నేహ వ‌చ్చారు. అక్క‌డ అల్లు అర్జున్ ఫాల్క‌న్ నే దించేశారు. అర్హ‌కు ఎలాంటి క‌ష్టం లేకుండా `ఫాల్క‌న్ బ‌స్`ని ఏర్పాటు చేయ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వచ్చింది.

వారంరోజుల్లోనే అర్హ పై చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశారు గుణ‌. ఇప్పుడు వీడ్కోలు ప‌లికే స‌మ‌యం. త‌న‌కు స్వాగ‌తం ప‌లికిన‌ప్పుడు చేసిన సందడే మ‌రోసారి క‌నిపించింది. బెలూన్లు .. మెరుపులు మిరుమిట్ల న‌డుమ‌ నిలబడి ఉన్న‌ అర్హ కేక్ లను కత్తిరించింది. త‌న‌తో పాటు డాడీ అల్లు అర్జున్.. మామ్ స్నేహ కూడా ఉన్నారు. ఇదిగో అల్ల‌రి అర్హ కెమెరాల‌కు ఫోజులిచ్చి ఎలా ఛీర్ చేస్తోందో చూశారు క‌దా?. త‌న‌కు ఘ‌న‌మైన ఆరంగేట్ర‌మిది. ఆ ఆనందం అల్లు కుటుంబంలో స్పష్ఠంగా క‌నిపిస్తోంది. అర్హ ఈరోజు చిరస్మరణీయ క్షణాలతో ఇంటికి వెళ్ల‌డం అభిమానుల్లోనూ ఉద్వేగం నింపింది.

శాకుంత‌లంలో అర్హ న‌టిస్తోంది అన‌గానే బ‌న్ని ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకున్నారు. త‌న‌ని పెద్ద తెర‌పై చూడాల‌ని ఎంతో ముచ్చ‌ట‌ప‌డ్డారు. స‌మంత టైటిల్ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో అర్హ పాత్ర ఎలా ఉంటుంది? అంటూ ఆరాలు తీసారు. `ప్రిన్స్ భరత్` అనే పాత్ర‌లో ఎంతో క్యూట్ గా అర్హ‌ అల‌రిస్తుంద‌ని తెలిసింది.

పురు రాజవంశం రాజు దుష్యంతుల జీవితం ఆధారంగా రూపొందుతున్న పౌరాణిక డ్రామా శాకుంత‌లం. స‌మంత‌తో పాటు మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్టంతగా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.