Begin typing your search above and press return to search.

క్యూట్‌ అర్హ మరో క్యూట్ వీడియో వచ్చేసింది చూశారా?

By:  Tupaki Desk   |   26 March 2021 2:57 AM GMT
క్యూట్‌ అర్హ మరో క్యూట్ వీడియో వచ్చేసింది చూశారా?
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూతురు సితార సోషల్‌ మీడియాలో చిన్నప్పటి నుండే చాలా ఫేమస్ అయ్యింది. తన క్యూడ్‌ డాన్స్‌ మూమెంట్స్ మరియు తండ్రితో ఉన్న ఫొటోలతో సితార ఎన్నో సోషల్‌ మీడియాలో ట్రెడ్డింగ్ లో నిలిచిన విషయం తెల్సిందే. సితార తర్వాత స్టార్‌ కిడ్స్ లో అత్యధికంగా ట్రెడ్డింగ్‌ లో నిలుస్తున్నది అల్లు అర్హ. స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ కూతురు అర్హ రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో కనిపస్తూనే ఉంటుంది. తాజాగా స్నేహా రెడ్డి తన సోషల్‌ మీడియా వాల్ పై అర్హ కొత్త వీడియోను షేర్‌ చేసింది.

ప్రస్తుతం ఇన్‌ స్టా రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా రీల్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే అర్హ కూడా ఒక రీల్‌ చేసింది. మీ ఫేమరెట్ హీరోయిన్ ఎవరు అంటే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అంటూ చెప్పిగా స్పెల్లింగ్ చెప్పమంటే నో నో ఆలియా భట్‌ మై ఫేవరేట్‌ అంటూ చెప్పే రీల్స్ ట్రెండ్‌ అవుతున్నాయి. ఆ ఆడియోకు అర్హ రీల్‌ వీడియో చేసింది. స్నేహా షేర్‌ చేసిన ఆ వీడియో ట్రెండ్డింగ్‌ లో నిలిచింది. మొత్తానికి మరోసారి అర్హ టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియాగా నిలిచింది. ఇంకా మీరు ఆ వీడియో చూడకుంటే ఇక్కడ చూసేయండి.