Begin typing your search above and press return to search.

వాల్ట్ డిస్నీ వీడియోలో అల్లు ఆర్హా..!

By:  Tupaki Desk   |   13 April 2021 6:30 AM GMT
వాల్ట్ డిస్నీ వీడియోలో అల్లు ఆర్హా..!
X
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలతో పాటు అప్పుడప్పుడు వారి పిల్లలను కూడా సోషల్ మీడియాలో చూస్తుంటాం. సెలబ్రిటీలకంటే ఒక్కోసారి వారి కిడ్స్ ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీ కిడ్స్ చేసే అల్లరి మాములుగా ఉండటం లేదు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలు, అలాగే అల్లు అర్జున్ పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హా లేటెస్ట్ వీడియోను ఆయన భార్య స్నేహరెడ్డి షేర్ చేసింది. ఆ వీడియోలో ప్రముఖ వాల్ట్ డిస్నీ మూవీ 'బ్యూటీ అండ్ ది బీస్ట్' సినిమాలోని బెల్లే లుక్కులో ఆర్హా కనిపించి ఆశ్చర్యం కలిగించింది. ఎల్లో ఫ్లవర్స్ డ్రెస్ లో.. ది రాయల్ ఫీల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా బాక్గ్రౌండ్ మ్యూజిక్ లో అల్లు బేబీ చేతిలో గులాబీ ప్రత్యక్షం అవ్వడం విశేషం.

నిజానికి ఇంస్టా వీడియోలో అల్లు ఆర్హా ఎంతో క్యూట్ గా ముద్దుగా కనిపిస్తుంది. అల్లు అర్జున్ భార్య స్నేహ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పిల్లల ఫోటోలు, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీ మాల్దీవ్స్ లో సేదతీరుతుంది. ఎందుకంటే తన కొడుకు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్బంగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో టూర్ వెళ్లారు. కొన్నిరోజుల క్రితమే స్నేహ.. ఆర్హా బేబీస్ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ కూతురు సోషల్ మీడియాలో బెల్లేగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'పుష్ప' చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్నటువంటి ఆ సినిమా ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.