Begin typing your search above and press return to search.

కాన్సెప్ట్ కథల కోసమే ఈ బ్యానర్

By:  Tupaki Desk   |   8 Oct 2017 6:06 AM GMT
కాన్సెప్ట్ కథల కోసమే ఈ బ్యానర్
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ బ్యాన్నర్ పై ఎన్ని గొప్ప సినిమాలు తీశారో తెలిసిన విషయమే. ఇక వారితో పాటు యువి క్రియేషన్స్ కూడా ప్రస్తుతం మంచి హిట్స్ తో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఆ టాప్ ప్రొడక్షన్ హౌసులు కలిసి వి4 ప్రొడక్షన్ ని క్రియేట్ చేశారు. ఇందులో బన్నీవారు మరియు స్టూడియో గ్రీన్ వారు కూడా భాగమైయ్యారు. ఈ సంస్థలో మొట్టమొదటి సినిమాను హీరో ఆది తో తీస్తున్నారు. హర్రర్-కామెడీ నేపథ్యంలో నెక్స్ట్ నువ్వే అనే ఆ సినిమాను ఈటివి ప్రభాకర్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా ఆడియో వేడుకను చిత్ర యూనిట్ రీసెంట్ గా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. కొత్తగా టాలెంట్ ను ప్రోత్సహించడం కోసమే వి4 సృష్టించబడిందని తాము అందరం కలిసి కాన్సెప్ట్ బేసిడ్ సినిమాలను నిర్మించడానికి మాత్రమే ఈ సంస్థను క్రియేట్ చేశామని చెప్పారు. తమిళ్ లో ఎక్కువగా కాన్సెప్ట్ బేసిడ్ చిత్రాలకు ఆదరణ ఉంది. తెలుగులో కూడా ఇక నుంచి అలాంటి చిత్రాలు రప్పించేలా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.

మరొక ముఖ్యమైన విషయం కూడా అల్లు అరవింద్ తెలిపారు. వి4 క్రియేషన్స్ కలవడం ఎలాగ? నిర్మాతలను కలిసే వీలు పడుతుందా అని అందరిలోను ఒక అనుమానం ఉండవచ్చు కానీ అలా కాకుండా తాము ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించామని చెబుతూ.. త్వరలోనే ఆ విషయాన్ని వెల్లడిస్తామని వివరించారు. అలాగే నెక్స్ట్ నువ్వే చిత్ర యూనిట్ సభ్యులందరికి అల్లు అరవింద్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.