Begin typing your search above and press return to search.
బాబోయ్..సురేష్ బాబు 3 నెలలు అంటే అల్లు అరవింద్ 8 నెలలు అంటున్నాడు
By: Tupaki Desk | 24 April 2020 12:00 AM ISTకరోనా ప్రభావం నుండి టాలీవుడ్ లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే బయట పడుతుందని కొందరు ఆశ పడుతున్నారు. కాని సినీ విశ్లేషకులు మరియు నిర్మాతలు మాత్రం ఇప్పట్లో టాలీవుడ్ మాత్రమే కాదు ఏ సినిమా పరిశ్రమ కూడా కోుకోలేదు అంటూ చెప్పేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా మరో రెండు లేదా మూడు నెలలు థియేటర్లు మూసి ఉంచడమే బెటర్ అనే అభిప్రాయంను ప్రముఖ నిర్మాత.. డిస్ట్రిబ్యూటర్ అయిన సురేష్ బాబు అన్నారు. ఆయన వ్యాఖ్యలపై కొందరు థియేటర్ల యాజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
సురేష్ బాబు అన్నట్లుగానే ఇటీవల రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ థియేటర్లు మళ్లీ యధావిధిగా నడిచేందుకు కనీసం మూడు నాలుగు నెలల సమయం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇప్పుడు అల్లు అరవింద్ ఈ విషయమై స్పందిస్తూ ఇండస్ట్రీ మొత్తం ఆందోళన చెందే మాటలు మాట్లాడాడు. సినీ ప్రేక్షకులు మరియు సినీ కార్మికులు ప్రస్తుతం సినిమాలు ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతాయా అంటూ ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా హాల్స్ ను లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా ఓపెన్ చేయడం సాధ్యం అయ్యేలా కనిపించడం లేదని.. సినిమా థియేటర్లకు ప్రేక్షకులు యధావిధిగా రావాలంటే డిసెంబర్.. జనవరి వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంక్రాంతికి మళ్లీ సినిమాల సీజన్ యధావిధిగా వస్తుందనే అభిప్రాయంను ఆయన వ్యక్తం చేయడం ప్రస్తుతం సినీ వర్గాల వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. సినిమా పరిశ్రమ గతంలో మాదిరిగా కళకళలాడాలంటే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రావాలని.. వ్యాక్సిన్ వచ్చే వరకు కష్టాలు తప్పవంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.