Begin typing your search above and press return to search.
మూడు భాగాలతో అల్లు మెగా రామాయణం
By: Tupaki Desk | 8 July 2019 12:27 PM ISTసుమారుగా ఏడాది క్రితమే రామాయణ గాధను భారీ ఎత్తున తెరకెక్కించే ప్రయత్నాల్లో నిర్మాత అల్లు అరవింద్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి కానీ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో ఆగిపోయిందేమో అనుకున్నారందరూ. కానీ బ్యాక్ గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకుని త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మల్టీ లాంగ్వేజ్ లో రూపొందే ఈ రామాయణం మొత్తం మూడు భాగాలుగా ఉంటుందట. టైటిల్ కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు. నటీనటులు టెక్నికల్ టీమ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
దర్శకులను మాత్రం ఫైనల్ చేశారు. దంగల్ తో ఇండియాతో పాటు చైనాలోనూ వసూళ్ల సునామి సృష్టించిన నితీష్ తివారితో పాటు శ్రీదేవి చివరి సినిమాగా మామ్ రూపంలో ఘన నివాళి అందించిన రవి ఉద్యావర్ జంటగా దీనికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ హై బడ్జెట్ విజువల్ ఎపిక్ కి మధు మంతెనతో పాటు నమిత్ మల్హోత్రా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తారు.
పూర్తిగా త్రిడి టెక్నాలజీతో రూపొందే ఈ రామాయణలో ఎవరు నటిస్తారు అనేది పెద్ద సస్పెన్సుగా నిలుస్తోంది. మెగా హీరోలు ఎవరైనా ఉంటారా లేక పూర్తిగా బాలీవుడ్ క్యాస్టింగ్ తో చేయబోతున్నారా లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. హిందీ తమిళ్ తెలుగులో రూపొందబోయే ఈ గాధకు స్టార్ క్యాస్ట్ చాలా భారీగా అవసరం పడుతుంది. ఎలా ప్లాన్ చేయబోతున్నారో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే