Begin typing your search above and press return to search.

సుమకి అల్లు పంచ్ పడింది

By:  Tupaki Desk   |   2 Oct 2015 4:29 PM GMT
సుమకి అల్లు పంచ్ పడింది
X
మెగా ఫ్యామిలీ ఫంక్షన్ లకు ఆలీ - సుమ ఇద్దరూ కలిసి యాంకరింగ్ చేస్తున్నారు చాలా కాలంగా. అయితే.. బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ ని సుమ ఒక్కతే హ్యాండిల్ చేయడం విశేషం. కొన్ని సార్లుగా ఫంక్షన్లలో ఆలీ - సుమ అరవింద్ ల మధ్య మాటలతో ఫన్నీ ఫైట్లు బాగానే జరుగుతున్నాయి.

సన్నాఫ్ సత్యమూర్తి ఫంక్షన్ లో అయితే.. సుమ - అల్లు అరవింద్ లను ఓ రేంజ్ లో ఆడేసుకున్నాడు ఆలీ. అప్పుడు హర్ట్ అయిన సుమ.. తర్వాత ఆలీకి అల్లు అర్జున్ పంచ్ వేసినపుడు.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ.. మీక్కూడా పంచ్ పడింది ఆలీ గారూ అంటూ చెప్పేసింది. ఇప్పుడు బ్రూస్ లీ ఫంక్షన్ లో ఆలీ లేడు. అయినా సరే.. మళ్లీ సుమకు కౌంటర్ పడింది. ఈసారి వంతు అల్లు అరవింద్ ది కావడం విశేషం.

చిరు 151 వ నేనే తీస్తానని చెప్పాక.. మిమ్మల్ని ఒకటి అడగాలి అల్లు అరవింద్ గారూ అనగానే.. చిరు పక్కన హీరోయిన్ పాత్ర అడుగుతావేమో అని భయపడ్డా అన్నారు అల్లు. నాకు పోటీగా నదియా ఉన్నారంటూ.. కాస్త కవర్ చేసేందుకు ట్రై చేసినా.. దొరికిపోయినట్లయింది సుమ పరిస్థితి. మొత్తానికి ఫంక్షన్ ఏదైనా.. అల్లు అరవింద్ - సుమలు మధ్యమధ్యలో పంచ్ లు వేసేస్తుండడం విశేషం.