Begin typing your search above and press return to search.

మెగా ప్రొడ్యూసర్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'రామాయణం' ఆగిపోలేదంట...!

By:  Tupaki Desk   |   18 April 2020 11:50 AM GMT
మెగా ప్రొడ్యూసర్ డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం ఆగిపోలేదంట...!
X
టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 1500 కోట్ల బడ్జెట్ తో ‘రామాయణం’ ప్రాజెక్ట్‌ ను గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రం నిర్మాణం కోసం నిర్మాతలు మధు మంతెన - నమిత్ మల్హోత్ర - అల్లు అరవింద్ జతకట్టారు. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి మరియు ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ ఈ సిరీస్‌ కు దర్శకత్వం వహించనున్నారని తెలియజేశారు. మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్ర తొలి భాగం 2021లో విడుదలవుతుందని కూడా ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ - రామ్ చరణ్ - హృతిక్ రోషన్ - దీపికా పదుకొణె నటించనున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ చిత్ర యూనిట్ నుండి మరో అప్డేట్ బయటకి రాలేదు. అల్లు అరవింద్ కూడా ఈ సినిమా విషయంలో సైలెంటుగా ఉంటూ వస్తున్నాడు. దీంతో కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆదిలోనే ఆగిపోయిందని న్యూస్ బయటకి వచ్చింది.

అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అల్లు అరవింద్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'రామాయణం'ని పక్కన పెట్టలేదట. ఇంకా ఈ చిత్రాన్ని రూపొందించాలనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం పలు భారతీయ భాషల్లో విడుదలవబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ఆర్.ఆర్.ఆర్' విడుదలైన తర్వాత ఆ సినిమా నేషనల్ వైడ్ చూపే ప్రభావాన్ని బట్టి 'రామాయణం' ముందుకు తీసుకెళ్లాలని అల్లు అరవింద్ ఆలోచిస్తున్నాడట.

వాస్తవానికి ఇతిహాస గాథ ‘రామాయణం’పై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. సినిమాల ద్వారా రామాయణం గురించి తెలుసుకున్నవారే ఎక్కువ. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ రామారావు మొదలుకొని శోభన్‌బాబు, బాలకృష్ణ, సుమన్ - జూనియర్ ఎన్టీఆర్ వరకు రాముడి పాత్రల్లో నటించారు. ఇప్పటి వరకు మనం రామాయణాన్ని బ్లాక్ అండ్ వైట్ - కలర్‌ లో చూశాం. కాకపోతే మెగా ప్రొడ్యూసర్ రామాయణాన్ని 3డిలో తీయబోతున్నాడు. ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు విన్న తనవీ తీరని కావ్యం రామాయణం అంటారు కదా. మరి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కి మరోసారి రామాయణాన్ని మన ముందుకు తీసుకొస్తారేమో చూడాలి.