Begin typing your search above and press return to search.

ఆహా కు మెగా ముద్ర ప్రతికూలంగా మారిందా??

By:  Tupaki Desk   |   16 April 2020 9:10 AM GMT
ఆహా కు మెగా ముద్ర ప్రతికూలంగా మారిందా??
X
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ప్రేక్షకులనుండి భారీ ఆదరణ దక్కుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఓటీటీ దిగ్గజాలతో పాటు భారతదేశంలోని కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఇప్పటికే ఈ ఓటీటీల్లో పెట్టుబడులు పెట్టాయి. వీటిలో కొన్నిటికి భారీ సంఖ్యలో సబ్ స్కైబర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు లాక్ డౌన్ పుణ్యమా అని ఆ సంఖ్య చాలా రెట్లు పెరుగుతోంది. అయితే మన తెలుగువారు మొదలు పెట్టిన ఆహా యాప్ మాత్రం పెద్దగా ఆదరణకు నోచుకోవడం లేదని అంటున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ వారు డైరెక్ట్ గా భాగస్వాములై ఉన్న తొలి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా. ఈ యాప్ ను సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ పర్యవేక్షిస్తున్నారు. నిజానికి ఆయన పేరు పైనే ఇది చలామణి అవుతున్నప్పటికీ దీనికి ఇతర ఇన్వెస్టర్లు కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ రంగంలో దిగ్గజాలుగా ఉన్న ఇతర ఓటీటీలు తెలుగు సినిమాలను కూడా స్ట్రీమింగ్ చేస్తూ ముందంజలో ఉన్నాయి. ఇదిలాా ఉంటే ఆహా యాప్ కు ఉన్న కొన్ని ప్రతికూలతలు సబ్ స్కైబర్లు పెరగకుండా అడ్డుకుంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

అల్లు అరవింద్ కి సంబంధించిన యాప్ అనగానే ఇది మెగా కాంపౌండ్ యాప్ అనే ముద్ర పడిపోయింది. అల్లు అరవింద్ ఓనర్ అని ప్రజలలో ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు. దీంతో గ్రౌండ్ లెవెల్ లో ఈ యాప్ ను మెగా ఫ్యాన్స్ తప్ప మిగతా వారు పెద్దగా ఆదరించడం లేదు. ఫ్యాన్స్ లో కూడా అల్లు ఫ్యామిలీని సపోర్ట్ చేసే వారు తప్ప మిగతా ఫ్యాన్స్ ఆహా పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని కూడా టాక్ ఉంది. దీనికి తోడుగా ఈ యాప్ లో ఆసక్తికరమైన కంటెంట్ లేకపోవడం మైనస్ గా మారిందని అంటున్నారు.

ఆశించినంత స్పందన దక్కకపోవడంతో ఈ సంస్థకు పెట్టుబడిదారుల్లో ఒకరైన మై హోమ్ రామేశ్వరరావు దీనికి సంబంధించిన మొదటి విడత బడ్జెట్లో అప్పుడే కోతలు విధించారట. దీంతో ఆహ లో పనిచేసే ఉద్యోగుల్లో ఇప్పటికే కాస్ట్ కటింగ్ భయం మొదలైందట. ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఆదరణ పెరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి కాస్ట్ కటింగ్ జరిగితే.. ఉన్న కొంత బ్రాండ్ వాల్యూ కూడా పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఈ యాప్ లో క్వాలిటీ పెంచాలని.. కంటెంట్ కూడా పెంచాలని అప్పుడే ఈ యాప్ అగ్ర ప్రధాన నిలిచే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నాయి.