Begin typing your search above and press return to search.

అల్లూ వారి ఖుషీకి అంతే లేదుగా!!

By:  Tupaki Desk   |   9 July 2016 8:05 AM GMT
అల్లూ వారి ఖుషీకి అంతే లేదుగా!!
X
ఒక హిట్టు సినిమా ప్రొడ్యూసర్ గా మీ ఫీలింగ్స్ చెప్పండి సార్‌ అంటే.. అసలు ఆయన హ్యాపీనెస్ కు అంతనేదే లేదని ఆయన మాటలు విన్నవారికి అర్దమైపోతోంది. ఆయనే అల్లు అరవింద్‌. గత కొన్నేళ్లుగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఆయన అనేక సినిమాలు తీసినా కూడా.. అసలు సిసలైన కిక్‌ మాత్రం తన కొడుకు అల్లు అర్జున్ రూపంలోనే వచ్చిందటున్నారు.

''అప్పట్లో అమీర్ ఖాన్‌ తో గజనీ తీసినప్పుడు.. ఆ సినిమా అతని కెరియర్ లోనే బెస్ట్ ఫిలిం. హైయెస్ట్ గ్రాసర్. ఆ తరువాత రామ్‌ చరణ్‌ తో మగధీర తీస్తే.. ఇప్పటికీ చరణ్ కెరియర్‌లో అదే అతి పెద్ద గ్రాసర్ గా ఉంది. కాకపోతే రెండుసార్లు నేను బన్నీతో సినిమాలు తీసినా.. హ్యాపీ అండ్‌ బద్రినాథ్‌.. మాత్రం నాకు నిరాశనే మిగిల్చాయి. కాకపోతే సరైనోడు సినిమా మాత్రం తన కెరియర్ లోనే అత్యంత వసూళ్లు కలిగిన చిత్రంగా సక్సెస్ అవ్వడం ఇప్పుడు హ్యపీగా ఉంది. ఒక ప్రొడ్యూసర్ గా ఒక తండ్రిగా ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను'' అంటూ చెప్పారు అరవింద్‌.

మొత్తంగా 76 కోట్ల షేర్‌ ను వసూలు చేసిన ''సరైనోడు'' సినిమా బన్నీకే కాదు.. బోయపాటికీ.. రకుల్‌ ప్రీత్‌ కి.. క్యాథరీన్‌ త్రెసాకు.. తమన్ కు.. ఇలా చాలామంది హైయెస్ట్ గ్రాసింగ్‌ సినిమా అనే చెప్పాలి. అందుకే అల్లూవారి ఖుషీకి అంతే లేకుండా పోయింది. గుడ్ లక్‌ ఫర్ నెక్ట్స్ అరవింద్ గారూ!!