Begin typing your search above and press return to search.

'గ‌జిని' ప్లాన్ ని రిపీట్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   30 Sep 2022 11:30 PM GMT
గ‌జిని ప్లాన్ ని రిపీట్ చేస్తున్నారా?
X
మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ఎప్పుడు భిన్నంగా ఆలోచిస్తూ త‌న‌దైన మాస్ట‌ర్ ప్లాన్ తో ముందుకు సాగుతుంటారు. 17 ఏళ్ల క్రితం సూర్య న‌టించిన `గజిని` మూవీని తెలుగులో రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే హీరో సూర్య ఇది తెలుగులో త‌న కెరీర్ ని మ‌లుపుతిప్పే సినిమా అని రిక్వెస్ట్ చేయ‌డం, రీమేక్ కాకుండా డ‌బ్బింగ్ వెర్ష‌న్ ని రిలీజ్ చేయ‌మ‌ని ఇప్పందాన్ని చేసుకోవ‌డంతో `గ‌జిని`ని తెలుగులో రీమేక్ చేయాల‌న్న ఆలోచ‌న‌ని అల్లు అర‌వింద్ ప‌క్క‌న పెట్టారు.

అయితే తెలుగులో ఆయ‌నే గీతా ఆర్ట్స్ పై రిలీజ్ చేయ‌డంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి హీరో సూర్య‌కు తెలుగుతో పాటు త‌మిళంలోనూ స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. ఆత‌రువాత ఇదే సినిమాని భారీ మాస్ట‌ర్ ప్లాన్ తో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో రీమేక్ చేశారు. టాగూర్ మ‌ధు, మ‌ధు మంతెన సంయుక్తంగా నిర్మించారు. రూ. 230 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి దేశ వ్యాప్తంగా ఈ మూవీ సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో మాస్ట‌ర్ మైండ్ అల్లు అర‌వింద్ పేరు బాలీవుడ్ లో మారు మోగిపోయింది.

ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యారు. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు అలాంటి ప్లాన్ తో అల్లు అర‌వింద్ రెడీ అవుతున్నారా? అంటే తాజాగా వినిపిస్తున్న వార్త‌లు నిజ‌మ‌నే సంకేతాల్ని అందిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే... కృష్ణ‌త‌త్వం నేప‌థ్యంలో యంగ్ డైరెక్ట‌ర్ చందూ మొండేటి తెర‌కెక్కించిన మూవీ `కార్తికేయ 2`. తెలుగుతో పాటు ఐదు భాష‌ల్లోనూ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ మూవీ ఊహించ‌ని విధంగా సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

ఉత్త‌రాదిలో రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో చందూ మొండేటి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఈ నేప‌థ్యంలోనే మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ నుంచి చందూ మొండేటికి బిగ్ ఆఫ‌ర్ ల‌భించింది. మంచి క‌థ‌ని సిద్ధం చేసుకుని వ‌స్తే బన్నీతో చేద్దామ‌ని చెప్పార‌ట‌. అయితే ఇదే స‌మ‌యంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ టీమ్ నుంచి ద‌ర్శ‌కుడు చందూ మొండేటికి ఫోన్ వెళ్లిన‌ట్టుగా తెలుస్తోంది. తను కూడా మంచి క‌థ తో వ‌స్తే క‌లిసి సినిమా చేద్దామ‌న్నార‌ట‌.

దీంతో మాస్ట‌ర్ మైండ్ ప్లాన్ మొత్తం మార్చేశార‌ట‌. బ‌న్నీతో కాకుండా హృతిక్ రోష‌న్ తోనే సినిమా చేద్దామ‌ని చెప్ప‌డం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బ‌న్నీని ప‌క్కన పెట్టి హృతిక్ తో వెళ్లాల‌ని స్టార్ ప్రొడ్యూస‌ర్ ప్లాన్ ఛేంజ్ చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం హీరో హృతిక్ రోష‌న్ అని తెలుస్తోంది. `గ‌జిని` త‌రువాత మ‌ళ్లీ ఆ స్థాయి సినిమాతో బాలీవుడ్ కు వెళ్లాల‌ని అల్లు అర‌వింద్ భావిస్తున్నారు కాబ‌ట్టి అందుకే త‌న ప్లాన్ ని మార్చార‌ట‌. ముందు బ‌న్నీతో కాకుండా హృతిక్ రోష‌న్ తో సినిమా చేద్దామ‌ని చందూ మొండేటి చెప్పిన‌ట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌లు విన్న వారంతా మ‌ళ్లీ `గ‌జిని` ప్లాన్ ని రిపీట్ చేస్తున్నారంటూ కామెంట్ లు చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.