Begin typing your search above and press return to search.

ఊళ్ళోలేని అరవింద్ డీల్ సెట్ చేశాడా?

By:  Tupaki Desk   |   11 July 2017 6:43 AM GMT
ఊళ్ళోలేని అరవింద్ డీల్ సెట్ చేశాడా?
X

ఫిలిం ఇండస్ర్టీలో ప్రతీ ప్రాజెక్టు గురించి.. ఓకె అయ్యి పట్టాలెక్కేవరకు చాలా స్టోరీలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి చేయబోయే కొత్త సినిమా గురించి కూడా ఇదే విధంగా అనేక కథలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా.. నిర్మాత డివివి దానయ్యతో రాజమౌళి సినిమా చేయాలి కాబట్టి.. ఆ ప్రొడ్యూసర్ కు అల్లు అరవింద్ బాగా క్లోజ్ కాబట్టి.. ఖచ్చితంగా అల్లు అర్జున్ హీరోగా రాజమౌళి సినిమా ఉంటుందనే ఊహాగానాలు వస్తున్నాయి. దీనిని కాస్త ముందుకు తీసుకెళ్లి.. ఇంకా చాలా కథలు అల్లేస్తున్నారు జనాలు. ఇందులో అసలు నిజముందా?

నిజానికి అల్లు అరవింద్ ఇప్పుడు రాజమౌళి వెంట పడుతున్నాడని.. ఎట్టి పరిస్థితుల్లో రాజమౌళి తన కొడుకుతోనే సినిమా చేయాలని ప్రెజర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఇసుమంత కూడా నిజం లేదు అంటున్నారు సన్నిహితులు. ''అసలు ఒక నెల నుండి అమెరికా టూర్లో ఉన్నారు అల్లు అరవింద్. మెగా ఫ్యాన్స్ దిల్ రాజు ఆఫీస్ దగ్గర రచ్చ జరిగేతేనే ఇంతవరకు ఆయన రాలేదు. అలాంటిరి రాజమౌళిని అమెరికా నుండి ప్రెజర్ చేస్తూ పైరవీలు చేస్తాడా?? ఊళ్ళో లేకుండానే డీల్ సెట్ చేస్తాడా?'' అంటూ కొట్టిపారేస్తున్నారు. అంతేకాదు.. ఇటీవలే తన సినిమా గురించి రాజమౌళి చెబుతూ.. తమ ఫ్యామిలీ ట్రిప్ అంతా పూర్తయ్యాక కథ రెడీ చేస్తానని.. అప్పుడే సినిమాలో హీరో ఎవరనేది ఆలోచిస్తానని చెప్పాడు. ఇంకా రాజమౌళి ట్రిప్ కే వెళ్ళలేదు.. కథే రాయలేదు.. అప్పుడే హీరోగా అల్లు అర్జున్ పేరు చెప్పుకోవడం ఏంటండీ బాబూ అంటున్నారు ఆయన సన్నిహితులు.

ఇకపోతే రాజమౌళి ఓ ఇద్దరి హీరోలతో బడా మల్టీ స్టారర్ సినిమా తీస్తాడని ఒక టాక్ వినిపిస్తోంది. అది కూడా కేవలం బుస్సే అంటున్నారు ఇండస్ర్టీ వర్గాలు. అసలు ఏదో విధంగా డిజె సినిమాను ప్రమోట్ చేయాలి కాబట్టి.. రాజమౌళి తదుపరి సినిమాలో బన్నీయే హీరో అంటూ అనవసర వార్తలు క్రియేట్ చేస్తున్నారని కొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అది సంగతి.