Begin typing your search above and press return to search.

గ్లామర్ ప్లస్ టాలెంట్ ఉన్న హీరోయిన్ పూజ హెగ్డే: అల్లు అరవింద్

By:  Tupaki Desk   |   9 Oct 2021 4:34 AM GMT
గ్లామర్ ప్లస్ టాలెంట్ ఉన్న హీరోయిన్ పూజ హెగ్డే: అల్లు అరవింద్
X
అల్లు అరవింద్ .. టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఆయన ఒకరు. ఒక కథలో ఏయే అంశాలు ఏ పాళ్లలో ఉండాలనే విషయంలో ఆయనకి అపారమైన అనుభవం ఉంది. నిర్మాణపరమైన విలువలతో ఆయన తెలుగు సినిమాను మరోస్థాయికి తీసుకువెళ్లారు. ఇటీవల కాలంలో ఆయన ఎంతోమంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాంటి అరవింద్ సమర్పణలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా నిర్మితమైంది. ఈ నెల 15వ తేదీన వస్తున్న ఈ సినిమా, నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేదికపై ఆయన మాట్లాడారు.

"ఎవరి నుంచి మొదలుపెట్టాలా .. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలా అని ఆలోచిస్తున్నాను. ముందుగా సినిమాటోగ్రఫర్ గురించి చెబుతాను. ఈ సినిమాను ఆయన చాలా బ్యూటిఫుల్ గా తీశారు. నిజంగా ఫెంటాస్టిక్ జాబ్. చాలా కలర్ ఫుల్ గా ఈ సినిమా రావడానికి కారకులు ఆయనే. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ విషయానికి వస్తే, నా దగ్గరికి వచ్చే ప్రతి సినిమాను ముందుగా ఆయన దగ్గరికి తీసుకుని వెళ్లమంటాను. ఆయనకి టైమ్ లేక నాతో చేయడం లేదు. ఈ సినిమాకి ఆయన అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా గొప్పగా ఉంది .. నిజంగా గ్రేట్ జాబ్.

బన్నీ వాసుకి .. భాస్కర్ మధ్య ఏంటి సంబంధం .. ఎందుకు భాస్కర్ ను ఇంతలా సపోర్ట్ చేస్తాడు? అనుకునేవాడిని. ఆయనను పట్టుకుని బన్నీ వాసు ఎందుకు ఇంతలా వేలాడుతూ ఉంటాడనేది ఆ తరువాత తెలిసింది. ఆయన భాస్కర్ కథలు మూడు తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. ఫైనల్ గా ఒక కథను ఓకే చేసి .. ఇక భాస్కర్ ను షూటింగుకి వెళ్లమని చెప్పిన రోజు నాకు ఇంకా గుర్తుంది. వాసువర్మ కూడా చాలా కష్టపడి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాడు. ఈ సినిమాలో అఖిల్ తన కెరియర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక పూజ కూడా అంతే స్థాయిలో గొప్పగా చేసింది.

ఈ మధ్య కాలంలో మనకి గ్లామర్ తో పాటు నటన తెలిసిన హీరోయిన్లు తక్కువయ్యారు. గ్లామర్ తో పాటు యాక్టింగ్ కూడా బాగా తెలిసిన హీరోయిన్ గా పూజ కనిపిస్తోంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని అన్నారు. ఇక బన్నీవాసు మాట్లాడుతూ .. "భాస్కర్ నా దగ్గరికి వచ్చినప్పుడు సింగిల్ సిట్టింగ్ లో అరవింద్ గారికి ఒప్పించే స్క్రిప్ట్ కావాలి నాకు .. ఎందుకంటే నేను పదే పదే ఆయనకి నేరేషన్ ఇవ్వలేను అని చెప్పాను. అప్పుడు తాను నాకు 45 నిమిషాల్లో ఈ కథను చెప్పాడు. కథ వినగానే నాకు బాగా నచ్చేసింది.

ఆ మరుసటి రోజున నేను భాస్కర్ ను తీసుకుని అరవింద గారి దగ్గరికి వెలితే, సింగిల్ సిట్టింగ్ లో ఆయన ఓకే చేశారు. అరవింద్ గారు ఒక కథను సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేయడం ఎంత కష్టమైన విషయమనేది అందరికీ తెలుసు. నాకు కూడా చాలా సర్ ప్రైజ్ .. అంత ఫాస్టుగా ఒక స్క్రిప్ట్ ఓకే అవుతుందని నేను అనుకోలేదు. ఆ తరువాత ఒక రోజున భాస్కర్ నా దగ్గరికి వచ్చి ఒక ట్విస్ట్ ఇచ్చాడు. కథకి ఒక ముఖ్యమైన పాయింట్ ని యాడ్ చేస్తున్నట్టు చెప్పాడు. అరవింద్ గారికి కూడా ఆ పాయింట్ నచ్చింది. ఆ రోజున భాస్కర్ కి తట్టిన ఆ కొత్త పాయింట్, సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది" అని చెప్పుకొచ్చాడు.