Begin typing your search above and press return to search.

అల్లు చెబుతున్న పెళ్లి కబుర్లు! !

By:  Tupaki Desk   |   12 Feb 2017 3:42 PM IST
అల్లు చెబుతున్న పెళ్లి కబుర్లు! !
X
ఇవాళ ప్రపంచ వివాహ దినోత్సవం సందర్భంగా.. పలువురు సెలబ్రిటీలు తమ వైవాహిక జీవితానికి సంబంధించిన మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఎప్పుడూ వెన్నంటే ఉండి.. కుడి భుజంగా మెలగడమే కాదు.. భారీ చిత్రాల నిర్మాతగా అల్లు అరవింద్ టాలీవుడ్ కి బాగా కావాల్సిన వ్యక్తి.

అల్లు అరవింద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి విశేషాలనే కాదు.. భార్యామణి నిర్మల గొప్పతనం గురించి కూడా చెప్పుకొచ్చారు. 21 ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకోమని అన్నారట తండ్రి అల్లు రామలింగయ్య. అయితే.. మూర మల్లెపూలు కొనేందుకు అవసరమయ్యే 10పైసలను తను సంపాదించుకోగలిగిన రోజు చేసుకుంటానన్న లాజిక్ కి అంగీకరించారట పెద్దాయన. అలా 23 ఏళ్లకు ప్రొడ్యూసర్ గా మారిన వెంటనే.. ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పారు అల్లు. ఇద్దరం ఎంతో అండర్ స్టాండింగ్ తో ఉంటామని చెప్పారు అల్ల అరవింద్.

అర్ధం చేసుకునే భార్య దొరకబట్టే ఇన్ని విజయాలు సాధించగలిగానని అన్నారాయన. తను మొదట్లో కోపిష్టిగా ఉన్నా పెద్దబ్బాయి పెళ్లి తర్వాత మారారట. ఉమ్మడి కుటుంబంగా జీవించడం ఎంతో ఇష్టం అన్న అల్లు అరవింద్.. బన్నీ, శిరీష్ లు తమతోనే కలిసి ఉంటారని.. పెద్దబ్బాయి వెంకటేష్ మాత్రం విడిగా ఉంటారని చెప్పుకొచ్చారు.