Begin typing your search above and press return to search.

మరో ప్రయోగానికి అల్లరి నరేస్ నాంది

By:  Tupaki Desk   |   13 Aug 2021 9:01 AM IST
మరో ప్రయోగానికి అల్లరి నరేస్ నాంది
X
అల్లరి నరేష్‌ కెరీర్‌ ఆరంభంలో వరుసగా సక్సెస్‌ లను దక్కించుకుని మినిమం గ్యారెంటీ హీరో అన్నట్లుగా గుర్తింపు దక్కించుకున్నాడు. కాని ఆమద్య వరుసగా ప్లాప్‌ లను చవి చూశాడు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్న సమయంలో హీరోగా సినిమాలు చేయడం మానేయాలా అనే విధంగా అల్లరోడు ఆలోచించాడు అంటూ ఆ మద్య వార్తలు వచ్చాయి. మహర్షి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అల్లరి నరేష్‌ ఇక పూర్తిగా ఆ తరహా పాత్రలకే పరిమితం అవుతాడని భావించారు. కాని అనూహ్యంగా అల్లరోడు నాందితో ప్రయోగం చేసి సూపర్‌ సక్సెస్ అయ్యాడు.

ఈయన నవ్వించడం మాత్రమే కాదు ఏడిపించడం కూడా తెలుసు అన్నట్లుగా మరోసారి నాందితో అల్లరి నరేష్ నిరూపించాడు. నాంది సినిమా సక్సెస్‌ తో అల్లరోడు వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. కొన్ని నెలల క్రితమే అల్లరి నరేష్‌ సభకు నమస్కారం సినిమా ను అనౌన్స్‌ చేశారు. కరోనా ఇతరత్ర కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు అల్లరోడి సభకు నమస్కారం సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. మహేష్‌ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

సతీష్‌ మల్లంపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా అల్లరి నరేష్‌ కు ఒక ప్రయోగాత్మక సినిమా అనవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు పొలిటికల్‌ గా నరేష్‌ సీరియస్‌ డ్రామాను చేసిందే లేదు. కనుక ఆయనకు ఈ సినిమా ఛాలెంజ్‌ గా ఉంటుంది. అల్లరోడి నుండి కొత్త తరహా సినిమాలను ఆశిస్తున్న అభిమానులకు సభకు నమస్కారం సినిమా ఖచ్చితంగా కొత్త ఫీల్‌ ను ఇస్తుంది. అలాగే అల్లరి నరేష్‌ ను కొత్తగా చూపించడం జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.