Begin typing your search above and press return to search.

'నా భర్త అద్భుతమైన నటుడు' అంటున్న స్టార్ హీరో భార్య

By:  Tupaki Desk   |   18 April 2020 12:30 AM GMT
నా భర్త అద్భుతమైన నటుడు అంటున్న స్టార్ హీరో భార్య
X
టాలీవుడ్ లో అల్లరి నరేష్ ఈ పేరు వింటేనే మన పెదాలపై చిరునవ్వు చిగురిస్తుంది. ఎందుకంటే అతని సినిమాలలో ఉండే సందడే వేరు. తన కెరీర్ లో అల్లరి సినిమాతో హిట్ మొదటి హిట్ అందుకొని సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. కెరీర్ ప్రారంభమైన కొంతకాలంలోనే తన హావభావాలతో - కామెడీ టైమింగ్ తో మంచిపేరును సంపాదించుకున్నాడు.

మంచి కామెడీ మూవీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని పెద్ద హీరోలకు ధీటుగా నిలబడ్డాడు. కానీ గత రెండేళ్లుగా తన నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. గతేడాది మహర్షి మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాడు తప్ప హీరోగా రాలేదు. ఫ్రెండ్ గా సక్సెస్ అయ్యాడనుకోండి.. కానీ ప్రేక్షకులు ఆశించిన అల్లరి అందులో లేదు. పూర్తి ఎమోషనల్ పాత్రలో కనిపించాడు.

కానీ నరేష్ భార్య విరూప మాత్రం భర్త సినిమాలు అసలు చూడలేదట. అతడితో పెళ్లి అయ్యే ముందు వరకు తన సినిమా ఒక్కటంటే ఒక్కటీ చూడలేదట. అల్లరోడిని పెళ్లి చేసుకున్న రెండు వారాల తర్వాత అతడి తొలి సినిమాను చూసిందట. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా విరూపనే ఇటీవల వెల్లడించడం విశేషం. అల్లరి నరేష్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన ‘నేను’ తను చూసిన మొదటి సినిమా అని చెప్పింది.

‘నేను’ సినిమాకు 16 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో క్లైమాక్స్‌ లో నరేష్ అద్భుతంగా నటించిన ఓ సన్నివేశం తాలూకు ఫొటో పెట్టి.. ఈ సినిమా రిలీజైనప్పటి కంటే తర్వాతి కాలంలో రావాల్సిందని.. ఇందులో నరేష్ అద్భుతంగా నటించాడని పేర్కొంది. 2004లో ఈ సినిమా రిలీజైతే తాను నరేష్‌ను పెళ్లాడిన రెండు వారాలకు అంటే 2011లో ఈ సినిమా చూశానని విరూప తెలిపింది. నా భర్త అద్భుతమైన నటుడు అంటూ మెచ్చుకుంటుందట. అసలు సినిమాలు చూడకుండా పెళ్లి చేసుకోవడమే ఆశ్చర్యంగా ఉందంటే భర్త మొదటి సినిమాను చూశానని 16ఏళ్లకు చెప్పడం మరో విశేషంగా అభిమానులు భావిస్తున్నారు.