Begin typing your search above and press return to search.
అల్లరోడి అదిరిపోయే ప్లానింగ్..!
By: Tupaki Desk | 6 Nov 2020 12:40 PM ISTఅల్లరి' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి అదే తన ఇంటి పేరుగా మార్చుకున్న నరేష్.. గత కొన్నేళ్లుగా వెండితెరపై తనదైన హాస్యంతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ ఇ.వి.వి. సత్యనారాయణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్.. 50కి పైగా సినిమాల్లో నటించాడు. 'గమ్యం' 'శంభో శివ శంభో' 'బెండు అప్పారావు' 'బ్లేడ్ బాబ్జీ' 'సీమ శాస్త్రి' 'అత్తిలి సత్తిబాబు' 'నేను' 'కితకితలు' 'కత్తి కాంతారావు' 'సుడిగాడు' వంటి వేటికవే ప్రత్యేకమైన చిత్రాల్లో నటించాడు. హీరోగా నటిస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి అందరి మన్ననలు అందుకున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు హీరోగా నటించిన 'మహర్షి' సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసి మెప్పించాడు. లేటెస్టుగా అల్లరోడు తన పంథా మార్చుకొని ప్రయోగాత్మక చిత్రం 'నాంది' లో నటించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో అల్లరి నరేష్.. తనలోని కొత్త యాంగిల్ బయటపడేలా తగు జాగ్రత్తలు తీసుకున్నాడని తెలుస్తోంది.
కాగా, అల్లరి నరేష్ 'నాంది' సినిమా తరువాత మరో కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాడని సమాచారం. ఇక ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన 'బంగారు బుల్లోడు' సినిమా రిలీజ్ రెడీగా ఉంది. అయితే ఇకపై కామెడీ పాత్రలే కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో ఏదైనా మంచి రోల్స్ వస్తే చేయడానికి సిద్ధమే అని నరేష్ సంకేతాలు ఇస్తున్నాడట. ఈ మేరకు ఇప్పటికే కొందరు అగ్ర దర్శకులకి అల్లరోడు ప్రపోజల్ కూడా పంపినట్లుగా ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ చిన్న నిర్మాతలకు పెద్ద దిక్కుగా ఉంటున్న అల్లరి నరేష్.. తన తండ్రి స్థాపించిన 'ఈవీవీ సినిమా' బ్యానర్ లో బయట హీరోల్ని పెట్టి సినిమాలు తీయడానికి కూడా నరేష్ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా సమాచారం. ఈ బ్యానర్ లో చివరగా ఆర్యన్ రాజేష్ నిర్మాతగా నరేష్ హీరోగా 'బందిపోటు' అనే సినిమా తీశారు. ఏదేమైనా నరేష్ అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు సినిమాల నిర్మాణంలో కూడా భాగస్వామ్యం పంచుకొని బిజీగా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.