Begin typing your search above and press return to search.
అల్లరి నరేష్ ఉగ్రం.. సర్ ప్రైజ్ రెడీ!
By: Tupaki Desk | 9 Feb 2023 1:05 PM GMTఒకప్పుడు కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్... ఈ మధ్య ట్రెండు మార్చి సిరియస్ సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన నాంది సూపర్ హిట్ కాగా ఆ తర్వాత నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో కూడా సందడి చేస్తోంది.
అయితే అల్లరి నరేష్ నాంది లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను తనకు అందించిన దర్శకుడు విజయ్ తో కలిసి మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పేరే ఉగ్రం. గతంలో వీరి కాంబినేషన్లో తెరకెక్కిన నాంది సినిమా సూపర్ హిట్ కావడంతో వీరిద్దరి కాంబినేషన్ మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఉగ్రం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఉగ్రం సినిమా ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్స్ సిద్ధమవుతుండగా ఇప్పటికే ఈ సినిమా యూనిట్ అధికారిక ప్రకటన కూడా చేశారు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా టీజర్ అప్డేట్ కూడా వచ్చేసింది. ఈ సినిమా టీజర్ ని శివరాత్రి సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 18వ తేదీన శివరాత్రి రానుండగా అదే రోజు టీజర్ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా దర్శన నటిస్తుండగా శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు.
సాహు గారపాటి హరీష్ పెద్ది కలిసి ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఖచ్చితంగా మొదటి సినిమా వీరిద్దరి కాంబినేషన్లో సూపర్ హిట్ కావడంతో రెండవ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.
అయితే గతంలో కన్నడలో తెరకెక్కిన ఉగ్రం సినిమాకి ఈ సినిమా రీమేక్ అనే ప్రచారం జరుగుతూ ఉండగా ఆ విషయం మీద మాత్రం ఇప్పటివరకు అధికారిక క్లారిటీ అయితే లేదు. ఒకసారి ప్రమోషన్స్ ప్రారంభించిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.