Begin typing your search above and press return to search.

ఈ కామెడీ పద్దతులు మానవా నరేష్‌?

By:  Tupaki Desk   |   12 March 2016 3:30 PM GMT
ఈ కామెడీ పద్దతులు మానవా నరేష్‌?
X
ఇప్పుడు కొత్తగా ''సెల్ఫీ రాజా'' అంటూ ఒక కాంటెంపరరీ టైటిల్‌ తో వస్తున్నాడు అల్లరి నరేష్‌. ఈ విషయం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అయితే ఇలా వెరైటీ టైటిళ్లు పెట్టినప్పుడల్లా ఏదో ఒక కొత్త రకం ప్రమోషన్‌ కూడా చేస్తుంటాడు నరేష్‌. కాని మనోడి పద్దతులు అవుట్‌ డేటెడ్‌ అయిపోయినాయి అనే విషయం మాత్రం గుర్తించట్లేదు.

మ్యాటర్‌ ఏంటంటే.. ఇప్పుడు ఇండియా అంతటా కింగ్‌ ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యా లండన్‌ ఎస్కేప్‌ అయిన విషయం గురించే చర్చంతా. ఈ సందర్భంగా తన ''సెల్ఫీ రాజా'' టైటిల్‌ కు కూడా బాగా వర్కవుట్‌ అవుతుంది అనుకున్నాడేమో.. విజయ్‌ మాల్యతో దిగిన సెల్ఫీ ఒకటి అల్లరి నరేష్‌ తన నిర్మాతల ద్వారా మీడియాకు పంపించాడు. బాగానే ఉందీ కామెడీ. కాకపోతే ఎప్పుడూ ఇలాంటి కుళ్ళు జోకులేనా ఈసారి నిజంగా సినిమాలో సరుకేమైనా ఉంటుందా అంటున్నారు జనాలు. ఎందుకంటే.. అప్పుడెప్పుడో సరైనోడు సినిమా తరువాత.. ఇంతవరకు మళ్ళీ మనోడికి ఒక్క హిట్టు లేకపోవడానికి కారణం ఏంటంటే.. ఇదిగో ఇలా మ్యాటర్‌ లేని కుళ్ళు కామెడీతో నవ్వించాలని చూడటమే.

ఇప్పటికైనా పద్దతి మార్చి మనోడు కొత్తగా ప్రయత్నిస్తే బెటర్‌.