Begin typing your search above and press return to search.
ఆ ఒక్క డైలాగ్ విని సినిమా చేశాడట
By: Tupaki Desk | 4 July 2016 5:52 AM GMTఅప్పటికి అల్లరి నరేష్ మాంచి డిమాండ్లో ఉన్న హీరో. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్)కు అసలు సినిమాల్లో పని చేసిన అనుభవమే లేదు. పైగా అతడి ‘గమ్యం’ కథను తెరకెక్కించడానికి నిర్మాత లేడు. సొంతంగా చాలా తక్కువ ఖర్చులో సినిమాను తీసేయాలని ప్లాన్ చేస్తున్నాడు క్రిష్. ఇలాంటి సినిమాకు అల్లరి నరేష్ ఒప్పుకోవడం.. అది కూడా హీరోగా కాకుండా క్యారెక్టర్ రోల్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఐతే క్రిష్ చెప్పిన ఒక్క డైలాగ్ తోనే తాను ఆ సినిమాను ఒప్పేసుకున్నానని.. ఆ కమిట్మెంట్ ప్రకారమే సినిమా చేశానని చెప్పాడు అల్లరి నరేష్. ‘శీనుగాడి సీనైపోయింది బాసు..’ అంటూ క్లైమాక్స్ లో తాను చనిపోయే ముందు చెప్పే డైలాగే తాను ‘గమ్యం’ ఒప్పుకోవడానికి కారణమని నరేష్ వెల్లడించాడు.
తన కెరీర్లో బెస్ట్ మూవీ ఏది అంటే ఒక సినిమా పేరు చెప్పడం కష్టమని.. ‘గమ్యం’తో ‘సుడిగాడు’ కూడా తన బెస్ట్ మూవీనే అని నరేష్ అన్నాడు. తన కెరీర్లో అత్యంత కష్టపడ్డ సినిమా ‘సుడిగాడు’యే అని నరేష్ చెప్పాడు. ‘‘సుడిగాడులో కథేమీ ఉండదు. కేవలం స్పూఫులతోనే సినిమా తీశాం. ప్రతి సన్నివేశం ఒకటికి రెండుసార్లు చూసుకున్నాం. ఇంకేదైనా సినిమాలో స్పూఫ్ చేశారేమో అని పరిశీలించి జాగ్రత్తగా బిట్ల మాదిరిగా ఒక్కో స్పూఫ్ తీసి.. తర్వాత ఒక్కోటి అతికించుకుంటూ వచ్చాం. ‘సుడిగాడు’ సినిమా చేశాక.. దానికి జనాల నుంచి వచ్చిన స్పందన చూశాక.. ఇక ఇంతకన్నా నవ్వించలేమని ఫీలయ్యాను’’ అని అల్లరి నరేష్ చెప్పాడు.