Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ :ఈ టైంలో ఇలాంటి అల్లరి అవసరం

By:  Tupaki Desk   |   10 April 2020 8:30 AM GMT
ఫొటోటాక్‌ :ఈ టైంలో ఇలాంటి అల్లరి అవసరం
X
ఎప్పుడు షూటింగ్స్‌ వ్యాపారాలు ఇతరత్ర కార్యక్రమాలు అంటూ బిజీగా తిరిగే సెలబ్రెటీలు కరోనా కారణంగా కేంద్రం విధించిన లాక్‌ డౌన్‌ తో పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఈ సమయంలో వారు వారి పిల్లలతో ఎక్కువ సమయం గడపడంతో పాటు కొత్త కొత్తగా పనులు చేస్తూ కుటుంబ సభ్యులతో మరింతగా క్లోజ్‌ అవుతున్నారు. ఎంతో మంది స్టార్స్‌ ప్రస్తుతం ఈ లాక్‌ డౌన్‌ టైంను పూర్తిగా కుటుంబ సభ్యులకే పరిమితం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

తాజాగా అల్లు అర్జున్‌ కూడా తన లాక్‌ డౌన్‌ టైం పొటోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఇంటికే పరిమితం అవుతున్న అల్లరి నరేష్‌ తన కూతురు ఎవికతో చాలా మంచి టైంను స్పెండ్‌ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇన్‌ స్టాలో ఈ ఫొటో పోస్ట్‌ చేసిన అల్లరి నరేష్‌.. నా ఏంజిల్‌ తో లాక్‌ డౌన్‌ టైం. ఈ సమయంలో పిల్లలు మాత్రమే ఈ ఒత్తిడి నుండి బయట పడేయగలరు. వారితో ముద్దులు హగ్గులతో ఏదో తెలియని పాజిటివ్‌ ఎనర్జి వస్తుందని అన్నాడు. అందుకే పిల్లలు ఉన్న వారు ఖచ్చితంగా వారికే పూర్తి టైం కేటాయించి ఈ టైంను ఎంజాయ్‌ చేయాలి.. వారి అల్లరిని ఎంజాయ్‌ చేస్తూ ఉండాలని పోస్ట్‌ చేశాడు.

ప్రస్తుతం అల్లరి నరేష్‌ నాంది చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సతీష్‌ వేగేశ్న నిర్మిస్తున్నాడు. ఇప్పటి వరకు కామెడీ చిత్రాలతో అలరించిన అల్లరోడు నాందిలో కొత్తగా కనిపించబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్‌ చూస్తేనే అర్థం అయ్యింది. మార్చి 2 నుండి కొత్త షెడ్యూల్‌ ప్రారంభం అవ్వగా లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ ఆపేశారు. దాంతో నాంది షూటింగ్‌ ప్రస్తుతంకు నిలిచి పోయింది. లాక్‌ డౌన్‌ ఎత్తి వేసిన వెంటనే సినిమా ప్రారంభం కాబోతుంది.