Begin typing your search above and press return to search.
అల్లరోడుని ఆ బ్యానర్ వదిలేటట్టు లేదుగా...!
By: Tupaki Desk | 19 Jun 2020 9:50 AM GMTస్టార్ డైరెక్టర్ ఇ.వి.వి.సత్యనారాయణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సిల్వర్ స్క్రీన్ పై గత కొన్నేళ్లుగా తనదైన హాస్యంతో ఆకట్టుకుంటూ వరుస విజయాల్ని సొంతం చేసుకున్నారు యంగ్ హీరో అల్లరి నరేష్. తన కెరీర్లో ఇప్పటి వరకు 55 చిత్రాలను పూర్తి చేసిన నరేష్ తన మొదటి సినిమా 'అల్లరి'తో 'అల్లరి నరేష్'గా మారిపోయారు. హీరోగా నటిస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అలాంటి వాటిలో ‘గమ్యం’ ‘శంభో శివ శంభో’ 'బెండు అప్పారావు' 'బ్లేడ్ బాబ్జీ' 'సీమ శాస్త్రి' 'అత్తిలి సత్తిబాబు' 'నేను' 'కితకితలు' 'కత్తి కాంతారావు' 'సుడిగాడు' 'మహర్షి' వంటి సినిమాల్లో అల్లరి నరేష్ నటన అద్భుతమని చెప్పవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం మన అల్లరోడు తన పంథా మార్చుకొని ‘నాంది’ అనే సినిమాలో నటించాడు. విజయ్ కనకమేడల దర్శకుడిగా పరచయమవుతున్న ఈ సినిమాకి ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరించాడు. కాగా అల్లరి నరేష్ గత కొంతకాలంగా సరైన సోలో సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అయితే దీనికి కారణం ఓ ప్రముఖ నిర్మాణ సంస్థే అని అల్లరి నరేష్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ అల్లరి నరేష్ తో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు నిర్మించింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాయి. ఒకప్పుడు సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోయిన నరేష్ ఇప్పుడు వరుస ప్లాపుల్లో కురుకుపోడానికి ఆ ప్రొడక్షన్ హౌస్ కారణమని వారు ఆరోపిస్తున్నారు. అల్లరి నరేశ్ కెరీర్ పాతాళానికి పడిపోవడానికి ఈ బ్యానర్ లో నటించిన సినిమాలే అని కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ అల్లరోడిని ఈ బ్యానర్ వీడలేదని విమర్శిస్తున్నారు. దానికి కారణం అసలే ఫ్లాప్ బ్యానర్ అనే ముద్ర పడిన ఆ ప్రొడక్షన్ హౌస్ వారు ఇప్పుడు అల్లరి నరేశ్ తో మరో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఎప్పుడో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే కరోనా వచ్చి అన్ని ప్లాన్స్ తారుమారు చేసింది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపించడం లేదట. దీంతో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ప్లాప్ బ్యానర్ అనే ముద్ర పడటం వలన మరియు అల్లరి నరేశ్ సినిమాలకి బుల్లితెరపై పెద్దగా వ్యూయర్ షిప్ లేకపోవడంతో ఓటీటీ వారు ఎవ్వరూ ఈ సినిమా వైపు చూడటం లేదట. ఏదేమైనా ఈ ప్రొడక్షన్ హౌస్ వారికి టైమ్ బాగోలేదనడానికి ఇది పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.