Begin typing your search above and press return to search.

అల్ల‌రోడికి బ్యాడ్ టైమ్ న‌డుస్తోంది

By:  Tupaki Desk   |   1 Oct 2015 9:30 AM GMT
అల్ల‌రోడికి బ్యాడ్ టైమ్ న‌డుస్తోంది
X
టాలీవుడ్‌ లో అత్యంత టాలెంటెడ్‌ హీరోగా అల్ల‌రి న‌రేష్ పేరు తెచ్చుకున్నాడు. అత‌డు న‌టిస్తే మినిమం గ్యారెంటీ అన్న మాట వినిపించేది. కానీ ఆ ఫేజ్ దాటిపోయింది ప్పుడు. అత‌డికి బ్యాడ్ టైమ్ న‌డుస్తోంది. న‌రేష్ న‌టిస్తే ఫ్లాపే అన్న ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇటీవ‌లి కాలంలో వ‌రుస ప‌రాజ‌యాలు న‌రేష్‌ ని కోలుకోనివ్వ‌కుండా చేశాయ్‌. అయితే స‌రిగ్గా ఇలాంటి టైమ్‌ లో అత‌డు ఓ ప్రెస్టేజియ‌స్ బ్యాన‌ర్‌ లో న‌టిస్తాడ‌న్న వార్త‌లు వినిపించాయి. కానీ అవ‌న్నీ ఇప్పుడు క్యాన్సిల్ అనే వినిపిస్తోంది.

న‌రేష్ హీరోగా జి.నాగేశ్వ‌ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతుంద‌ని ఈ చిత్రానికి ఛ‌త్ర‌ప‌తి నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా కొన‌సాగుతార‌ని వార్త‌లొచ్చాయి. నాగేశ్వర‌రెడ్డి స్ర్కిప్టు కూడా రెడీ చేశాడ‌ని చెప్పుకున్నారు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు లేద‌ని తెలుస్తోంది. నిన్న‌టిరోజున ఛ‌త్ర‌ప‌తి ప్ర‌సాద్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికైతే ఏదీ లేదు. కేవ‌లం సుకుమార్‌- ఎన్టీఆర్ సినిమాపైనే దృష్టి సారించాన‌ని నిర్మాత స్వ‌యంగా అన్నారు. దీన‌ర్థం న‌రేష్ ఫేజ్ బాలేద‌నే.

ఫ్లాపులొస్తున్నాయ్‌.. ఇప్పుడు చేసేదెలా? అనే అని అంతా ముచ్చ‌టించుకోవ‌డం విశేషం. అయితే ప్ర‌స్తుతం బ్యాడ్ ఫేజ్ న‌డిచినా.. కోలుకునే ద‌మ్ము న‌రేష్‌కి ఉంది. అత‌డి ప్ర‌తిభ‌ను క్వశ్చన్‌ చేయలేం. ఒకే ఒక్క హిట్టు ప‌డాలి. ఈ యంగ్ హీరో దానికోసం కాస్త కాన్స‌న్‌ ట్రేష‌న్‌ తో గురి పెడితే స‌రి.