Begin typing your search above and press return to search.

అల్లరి నరేష్ దెయ్యం ప్లాన్

By:  Tupaki Desk   |   22 Dec 2015 5:30 PM GMT
అల్లరి నరేష్ దెయ్యం ప్లాన్
X
అల్లరి నరేష్ 50వ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. మామ మంచు అల్లుడు కంచు చిత్రంతో సిల్వర్ జూబ్లీ కొట్టబోతున్నాడు ఈ కుర్ర కామెడీ హీరో. తెగ స్పీడుగా సినిమాలు చేసే అల్లరి నరేష్.. ఈ మధ్య ఫ్లాపుల కారణంగా కొంచెం స్పీడ్ తగ్గించాడు. అయితే.. 50వ సినిమా కోసం ముందునుంచే పక్కా ప్లానింగ్ లో ఉన్నాడట.

ప్రస్తుతం మోహన్ బాబుతో కలిసి నటించిన మామ మంచు.. అల్లుడు కంచు.. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు అల్లరి నరేష్. అసలు తన యాభయ్యవ చిత్రంగా ఈ మూవీ చేద్దామని అనుకోలేదని చెప్పాడు. నిజానికి నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో.. ఓ దెయ్యం కేరక్టర్ వేద్దామని అనుకున్నాడట. అంటే.. ఒక కేరక్టర్ దెయ్యంలాగా తిరుగుతూ, ఇంకో కేరక్టర్ హీరోగా ఉండే సినిమా అన్నమాట. ఈ ప్రాజెక్ట్ చేద్దామని డిసైడ్ అయినా.. ఈ లోపే సూర్య నటించిన రాక్షసుడు, నాగార్జున చేస్తున్న సోగ్గాడే చిన్న నాయన చిత్రాలు ఈ జోనర్ లోనివే కావడంతో ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయినట్లు నరేష్ చెప్పాడు.

ఈ సమయంలో ఏ ప్రాజెక్ట్ చేయాలా అని ఆలోచిస్తుంటే.. మంచు విష్ణు వచ్చి ఈ స్టోరీ చెప్పి ఒప్పించాడట. అలా తన 50వ సినిమా, మోహన్ బాబుతో కలిసి చేసినట్లు చెబుతున్నాడు అల్లరి నరేష్. వరుస పరాజయాల్లో ఉన్న ఈ కామెడీ హీరోకి.. మామ మంచు అల్లుడు కంచు హిట్ చాలా ముఖ్యం.