Begin typing your search above and press return to search.

మహేష్ సినిమాలో ఉన్నట్టా లేనట్టా?

By:  Tupaki Desk   |   8 Sep 2017 6:17 AM GMT
మహేష్ సినిమాలో ఉన్నట్టా లేనట్టా?
X
టాలీవుడ్ లో తనదైన కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ప్రస్తుతం ఆచి తూచి అడుగేస్తున్నాడు. ఒకప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలను రిలీజ్ చేసే ఈ కుర్ర హీరో నవ్వుల్లో ముంచెత్తేవాడు. అప్పుడప్పుడు గమ్య లాంటి సినిమాలను చేసి నటనపరంగా మంచి పేరు తెచ్చుకున్నాడు.కానీ గత కొంత కాలంగా నరేష్ చేసే అల్లరి తెరపై అంతగా సక్సెస్ కావడం లేదు.

అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని మలయాళం లో హిట్ అయిన కథని తెలుగులో మెడ మీద అబ్బాయిగా తీసుకురాబోతున్నాడు. అయితే సినిమా ప్రచారంలో భాగంగా నరేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు సినిమాలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఈ విధంగా స్పందించాడు. ఏం చెప్పాడంటే.. దాని గురించి ఇప్పుడు నేనేమి మాట్లాడలేను. దానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ప్రస్తుతం నా రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయని ఇప్పుడు కేవలం నా సినిమాల గురించే మాట్లాడతానని చెప్పాడు. అంతే కాకుండా దాని గురించి నేను కరెక్ట్ గా చెప్పలేను అని నరేష్ వివరించాడు.

కొన్ని రోజుల క్రితం మహేష్ - నరేష్ కాంబో లో మూవీ రాబోతోందన్న వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి తెరకెక్కించబోయే ఆ కథలో అల్లరి నరేష్ ఒక ముఖ్యపాత్ర చేస్తున్నాడని, నరేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు నరేష్ ఇలా స్పందించడం చూస్తుంటే మనోడు సినిమాలో గ్యారెంటీ గా ఉన్నడా లేడా అన్నది కాస్త సందేహంగానే ఉంది.