Begin typing your search above and press return to search.

అల్లరి నరేష్‌ ఇంట విషాదం

By:  Tupaki Desk   |   28 May 2019 11:46 AM IST
అల్లరి నరేష్‌ ఇంట విషాదం
X
ఇటీవలే 'మహర్షి' చిత్రంలో నటించి పాజిటివ్‌ రెస్పాన్స్‌ ను దక్కించుకున్న అల్లరి నరేష్‌ సంతోషంగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత సక్సెస్‌ దక్కిందంటూ ఇటీవలే మహర్షి సక్సెస్‌ వేడుకలో పాల్గొన్న సందర్బంగా సంతోషంగా ప్రకటించాడు. ఇంతలోనే ఆయన నానమ్మ చనిపోవడంతో దుఖ్ఖంలో మునిగి పోయాడు. 2011లో ఈవీవీ సత్యనారాయణ మృతి చెందారు. ఆయన మృతి తర్వాత ఆయన తల్లి ఈదర వెంకటరత్నమ్మ గారు సొంత గ్రామం అయిన నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో నివాసం ఉంటున్నారు.

87 ఏళ్ల ఈదర వెంకటరత్నమ్మ గారికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె. కొడుకులు ఈవీవీ సత్యనారాయణ.. గిరి.. శ్రీనివాస్‌.. కుమార్తె ముళ్లపూడి మంగ. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుఉన్న వెంకటరత్నమ్మ గారు నిన్న ఆమె స్వగృహంలో మరణించారు. వెంకటరత్నమ్మ అంత్యక్రియల్లో అల్లరి నరేష్‌.. ఆర్యన్‌ రాజేష్‌ లతో పాటు సత్తిబాబు.. అమ్మిరాజు ఇంకా పలువురు సినీ ప్రముఖులు ఈవీవీ కుటుంబ సన్నిహితులు పాల్గొన్నారు. నాన్నమ్మను కోల్పోయిన దుఖంలో అల్లరి నరేష్‌.. ఆర్యన్‌ రాజేష్‌ మునిగి పోయారు.