Begin typing your search above and press return to search.

అమెజాన్‌ లో రాబోతున్న మరో స్టార్‌ మూవీ

By:  Tupaki Desk   |   12 Jun 2020 9:30 AM GMT
అమెజాన్‌ లో రాబోతున్న మరో స్టార్‌ మూవీ
X
మహమ్మారి కారణంగా మూడు నెలలుగా థియేటర్లలో బొమ్మ పడలేదు. ఇంకా మూడు నెలల తర్వాత అయినా బొమ్మ పడుతుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఆ కారణంగా పలు సినిమాలను థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇప్పటికే ఓటీటీలో విడుదల అయ్యింది. త్వరలో కీర్తి సురేష్‌ ‘పెంగ్విన్‌’ సినిమా కూడా విడుదలకు రెడీగా ఉంది.

ఈ సినిమాలతో పాటు అల్లరి నరేష్‌ హీరోగా తెరకెక్కిన ‘బంగార్రు బుల్లోడు’ సినిమాను సైతం అమెజాన్‌ లో విడుదల చేసేందుకు చర్చలు జరిగాయట. దాదాపుగా సినిమా విడుదలకు మార్గం సుగమం అయ్యిందట. ఈ మహమ్మారి రాక ముందే సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా అల్లరి నరేష్‌ ప్రస్తుత కెరీర్‌ గ్రాఫ్‌ నేపథ్యంలో వాయిదా వేస్తూ వచ్చారు. బిజినెస్‌ కాక పోవడం వల్ల కూడా సినిమాను వాయిదా వేశారు అంటూ ప్రచారం జరిగింది.

ఈ సమయంలో అమెజాన్‌ లో విడుదల చేసేందుకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేస్తున్నారు. గిరి దర్శకత్వంలో ఈ సినిమాను ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ లో అనీల్‌ సుంకర నిర్మించాడు. అల్లరి నరేష్‌ ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి అయిన తర్వాత టీజర్‌ విడుదల చేసి విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.