Begin typing your search above and press return to search.
క్రైసిస్ ఎఫెక్ట్ ని అల్లరోడు అధిగమిస్తాడా?
By: Tupaki Desk | 11 Jun 2020 10:00 AM ISTఅల్లరి సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించి చాలా తక్కువ సమయంలో 50 సినిమాలు పూర్తి చేసిన హీరోగా నరేష్ పాపులరయ్యాడు. అర్థ సెంచరీ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి. సక్సెస్ ముఖం చాటేసింది. ఎంపికలు అభిమానులకు నచ్చలేదు. చేసిన ప్రయోగాలేవీ సత్ఫలితాలివ్వలేదు. కారణం ఏదైనా బ్యాడ్ ఫేజ్ తీవ్రంగానే ఇబ్బంది పెట్టింది.
ఆ క్రమంలోనే మహేష్ నటించిన మహర్షిలో క్యారెక్టర్ రోల్ చేసి మెప్పించాడు. కానీ అదీ కెరీర్ కి ఏమంత కలిసొచ్చినట్టు లేదు. అప్పటికే అల్లరోడికి నిర్మాతల బ్యాంక్ ఉంది కాబట్టి అడపాదడపా అవకాశాలు అందుకుంటూనే ఉన్నాడు. హీరోగా నటిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం నరేష్ మళ్ళీ కం బ్యాక్ కోసం బాగానే ట్రై చేస్తున్నాడు..!
ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ సినిమా మొత్తం సరిగా వచ్చాకే రిలీజ్ చేద్దామని నిర్మాతలకు చెబుతున్నాడట. అలానే బ్యాక్ టు బ్యాక్ బాగానే సినిమాలు కూడా లైన్ లో పెట్టాడు..! ప్రస్తుతం నాంది.. బంగారు బుల్లోడు సినిమాలు చేస్తున్నాడు నరేష్. ఇందులో ఎలాగూ తన హోమ్ బ్యానర్ గా చెప్పుకునే ఏకే బ్యానర్ అతడికి హిట్టిస్తుందా లేదా? అన్నది సస్పెన్స్.
అహనా పెళ్లంట (వీరభద్రమ్ చౌదరి డైరెక్టర్) లాంటి సక్సెస్ ఇచ్చిన ఏకే బ్యానర్ కి ఎలాంటి అడ్డు చెప్పకుండా నరేష్ ఓకే చెప్పేస్తుంటాడు. కానీ ఈ బ్యానర్ కి ఉన్న బాడ్ ఫేట్ వల్ల...ఎలాంటి రిజల్ట్ రానుందో అన్న టెన్షన్ అలానే ఉంది. బంగారు బుల్లోడు ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో కాస్త ఆగితే కానీ తెలీదు. నరేష్ సహా ఎందరో ఎన్నో ప్లాన్స్ వేసినా అన్నిటికీ కొవిడ్ చెక్ పెట్టేసింది. ప్రస్తుత సన్నివేశంలో ఎవరి ఫేట్ ఎలా ఉండాలో నిర్ణయించేది మహమ్మారీనే అనడంలో ఎలాంటి సందేహం లేదు.