Begin typing your search above and press return to search.
బర్త్ డే ట్వీటుతో అల్లరి హింటిచ్చాడా?
By: Tupaki Desk | 9 Aug 2018 9:04 AM GMTహీరో అల్లరి నరేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్టొరీ ముఖ్యం గా అల్లరి నరేష్ చుట్టూ తిరుగుతుందని, అల్లరి నరేష్ కోసమే మహేష్ పాత్ర అమెరికా నుండి ఇండియాకు వస్తుందని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. మరి మహేష్ పుట్టిన రోజు సందర్భంగా అల్లరి నరేష్ ఈ రోజు ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపాడు.
"రవి నుండి రిషి కి - మీకు జన్మదిన శుభాకాంక్షలు మహేష్ సర్. ఈ ప్రయాణంలో ల్యాండ్ మార్క్ చిత్రంలో భాగమవడం ఓ గౌరవంగా భావిస్తున్నాను. #MAHARSHI #HBDSuperstarMAHESH." ఇందులో శుభాకాంక్షలు అవన్నీ సూపర్.. కానీ అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం 'రవి నుండి రిషి కి' అనే పదం. రిషి అనేది 'మహర్షి' సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు అనే విషయం తెలిసిందే. సో.. 'రవి' అనేది సినిమాలో తన పాత్ర పేరు కాబట్టే ఆ హింట్ ఇచ్చినట్టుగా భావిస్తున్నారు.
అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. కామెడీనే కాకుండా 'గమ్యం'.. 'శంభో శివ శంభో' సినిమాల్లో చేసిన పవర్ఫుల్ రోల్స్ కి ప్రేక్షకుల నుండి ఎన్నో ప్రశంసలు లభించాయి. ఈ సారి రిషి కలిసి రవి చేయబోయే అల్లరిని, కురిపించబోయే సెంటిమెంటును చూడాలంటే మనం నెక్స్ట్ సమ్మర్ వరకూ వేచి చూడక తప్పదు.