Begin typing your search above and press return to search.

'బ‌ంగారు బుల్లోడు' జోష్ తేవాలి

By:  Tupaki Desk   |   30 Jun 2019 6:34 AM GMT
బ‌ంగారు బుల్లోడు జోష్ తేవాలి
X
మ‌హేష్ ల్యాండ్ మార్క్ మూవీ `మ‌హ‌ర్షి` రిలీజై 50రోజులు పూర్తి చేసుకుంది. అంత పెద్ద సినిమాతో ఆల్ మోస్ట్ రీలాంచ్ అయ్యాన‌ని అల్ల‌రి న‌రేష్ ఎంతో సంతోషాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. ఈ సినిమా త‌ర్వాత త‌న‌కు కెరీర్ ప‌రంగా డైల‌మా తొల‌గిపోతుంద‌ని ఆశించిన అత‌డి ప్ర‌స్తుత స‌న్నివేశ‌మేంటి? అంటే.. న‌రేష్ ఓవైపు అగ్ర హీరోల‌ చిత్రాల్లో క్యారెక్ట‌ర్ల‌లో న‌టించేందుకు సిద్ధమేన‌ని ప్ర‌క‌టించాడు. అలాగే హీరోగానూ ల‌క్ చెక్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.

మ‌హ‌ర్షి త‌ర్వాత న‌రేష్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి? అన్న‌ది ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం ఏ.కె ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ‌లో వ‌రుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడ‌ట‌. తొలిగా `బంగారు బుల్లోడు` తెర‌కెక్కుతోంది. తాజాగా న‌రేష్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ పోస్ట‌ర్ ని విడుదల చేసింది. టైటిల్ కి త‌గ్గ‌ట్టే పోస్ట‌ర్ లో ఎంతో జోష్ ఉన్న వేషధార‌ణ‌తో న‌రేష్ ఆక‌ట్టుకున్నాడు. అలాగే గత ఉగాదికి బంగారు బుల్లోడు తొలి లుక్ విడుద‌లై ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. పి.వి గిరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. పూజా ఝవేరీ క‌థానాయిక గా న‌టిస్తోంది. మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయ‌నున్నారు. అయితే ఈ సినిమా న‌రేష్ కి కెరీర్ ప‌రంగా ఏ మేర‌కు బూస్ట్ ఇస్తుంది? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్.

టాలీవుడ్ లో అత్యంత‌ వేగంగా 50 సినిమాలు పూర్తి చేసిన ఏకైక హీరోగా న‌రేష్ ప్ర‌తిభ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ తిరిగి అత‌డిని దారికి తెచ్చేందుకు అవ‌స‌రం. ఆ ఒక్క హిట్టు వ‌స్తుందా? అన్న‌దే స‌స్పెన్స్. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే హీరోగా కంబ్యాక్ అయ్యేందుకు అత‌డు ప్ర‌య‌త్నాలు సాగిస్తాడ‌ట‌. గ‌తం గ‌తః అనుకుంటే.. ఈ కొత్త దారిలో అయినా న‌రేష్ దూసుకెళ‌తాడ‌నే అభిమానులు భావిస్తున్నారు. నేడు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానులు శుభాకాంక్ష‌లు తెలిపారు. పరిశ్ర‌మ ప్ర‌ముఖులు అత‌డికి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపారు.