Begin typing your search above and press return to search.

కొత్త టైటిల్.. మేడ మీద అబ్బాయి

By:  Tupaki Desk   |   14 July 2016 9:37 AM GMT
కొత్త టైటిల్.. మేడ మీద అబ్బాయి
X
అల్లరి నరేష్ సినిమాలకు భలే ఫన్నీ టైటిల్స్ పెడుతుంటారు. అత్తిలి సత్తిబాబు.. బెండు అప్పారావు.. సీమ టపాకాయ్.. సుడిగాడు.. మడత కాజా.. ఇలా అల్లరోడి టైటిళ్లు భలే తమాషాగా.. ఆసక్తి రేకెత్తించేలా ఉంటాయి. ఈ శుక్రవారం ‘సెల్ఫీ రాజా’తో పలకరించబోతున్న నరేష్.. తన తర్వాతి సినిమాలకు కూడా సరదా టైటిళ్లే పెట్టాడు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో నరేష్ హీరోగా చేయబోయే సినిమాకు ‘ఇంట్లో దయ్యం నాకేంటి భయ్యం’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రానికి కూడా టైటిల్ ఓకే అయిపోయింది. ఈ చిత్రానికి ‘మేడ మీద అబ్బాయి’ అనే పేరు రిజిస్టర్ చేయించారు.

‘అలా ఎలా’ తర్వాత ఏడాదిన్నరపైగా విరామం తీసుకుని అల్లరి నరేష్ తో సినిమా చేస్తున్నాడు అనీష్. సీనియర్ కమెడియన్ కృష్ణభగవాన్ ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు మాటలు కూడా రాస్తుండటం విశేషం. అనీష్ తొలి సినిమాలోనూ కృష్ణభగవాన్ చిన్న పాత్ర చేయడంతో పాటు రచనా సహకారం అందించాడు. కృష్ణభగవాన్ గతంలో వంశీ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు మాటలు రాశాడు. అల్లరినరేష్-అనీష్ కాంబినేషన్లో రాబోయే సినిమాను జాహ్నవి ప్రొడక్షన్స్ అనే కొత్త సంస్థ నిర్మించబోతోంది. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఈ ఏడాది ఆఖర్లోనే ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.