Begin typing your search above and press return to search.

అల్లరి నరేష్‌ కు రానా ఫోన్ చేసి..

By:  Tupaki Desk   |   8 Sept 2017 10:07 AM IST
అల్లరి నరేష్‌ కు రానా ఫోన్ చేసి..
X
అల్లరి నరేష్ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమా విడుదలకు సిద్ధమైంది. అతను కథానాయకుడిగా నటించిన ‘మేడ మీద అబ్బాయి’ శుక్రవారమే విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి అల్లరోడు తన సినిమాను గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా అతను రానా దగ్గుబాటి నిర్వహిస్తున్న ‘నెం.1 యారి’ షోకు కూడా వెళ్లాడు. అక్కడ అతడికి.. రానాకు ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘మేడ మీద అబ్బాయి’ ట్రైలర్ గమనిస్తే.. అందులో ఒకచోట రానా ప్రస్తావన ఉంటుంది. ‘‘మేటర్ లేనోడికి మేటర్ లేదని చెప్పాలి కానీ.. నువ్వు దగ్గుబాటి రానా అని నెట్టకూడదు’’ అంటాడు నరేష్.

దీని మీద సోషల్ మీడియాలో ఇంతకుముందు ఆసక్తికర చర్చ జరిగింది. నరేష్ నీ గురించి కామెంట్ చేశాడంటూ రానా పేరు ట్యాగ్ చేస్తూ తనకు ట్విట్టర్లో చాలామంది మెసేజులు పంపినట్లు రానా తెలిపాడు. దీంతో తర్వాత రానా.. అల్లరి నరేష్‌ కు ఫోన్ చేసి ‘ఇంతకీ నాలో మేటర్ ఉందంటావా లేదంటావా బాబాయ్. నన్ను పొగిడావా తిట్టావా’ అని అడిగాడట. ఐతే ఈ డైలాగ్ విషయమై నరేష్ స్పందిస్తూ.. రానా తనకు మంచి ఫ్రెండ్ అని.. ఆ సాన్నిహిత్యంతోనే సరదాగా ఆ డైలాగ్ పెట్టామని.. ఆ డైలాగ్ రానా గురించి పాజటివ్‌ ఫీలింగే ఇస్తుందని వివరణ ఇచ్చాడు. రానా కూడా ఈ డైలాగ్‌ ను సరదాగానే తీసుకున్నట్లు చెప్పాడు. ఈ ఎపిసోడ్ అంతా కూడా చాలా సరదాగా సాగింది.