Begin typing your search above and press return to search.
మళ్ళీ కామెడీపై మనసు పడ్డ అల్లరి నరేష్
By: Tupaki Desk | 6 March 2023 9:57 AM GMTటాలీవుడ్ లో అల్లరి నరేష్ అంటే కామెడీ చిత్రాలు ఎక్కువగా గుర్తుకొస్తాయి. రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అల్లరి నరేష్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో అతను కామెడీకి ప్రాధాన్యత తగ్గించి కంటెంట్ బేస్డ్ కథలని ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నారు. నటుడిగా తనని తాను మరో కోణంలో ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే తనకి గుర్తింపు తీసుకొచ్చిన కామెడీ చిత్రాలని మాత్రం అల్లరి నరేష్ వదులుకోలేకపోతున్నాడు. కాని ప్రస్తుతం కామెడీ అడ్రెస్ మారిపోయింది. కథలో భాగంగా వచ్చే పంచ్ లు, అలాగే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ ద్వారా జెనరేట్ అయ్యే కామెడీకి మంచి డిమాండ్ ఉంది. కామెడీలో కూడా సెటిల్డ్ కామెడీని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కథ మొత్తం కేవలం కామెడీ డైలాగ్స్ తో నింపేసి సినిమా చూపించాలని ప్రయత్నం చేస్తే ప్రేక్షకులు తిరిగి సదరు హీరోలకి సినిమా చూపిస్తున్నారు.
దీంతో కామెడీ చిత్రాలు చేసే శైలి కూడా పూర్తిగా మారిందని చెప్పాలి. జాతిరత్నాలు లాంటి ఇంటరెస్టింగ్ కామెడీని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే అల్లరి నరేష్ కూడా న్యూ ఏజ్ కామెడీ కంటెంట్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఈ నేపధ్యంలో జాతిరత్నాలు, ప్రిన్స్ సినిమాలతో మంచి కామెడీ జెనరేట్ చేసిన దర్శకుడు కెవి అనుదీప్ తో సినిమా చేయడానికి అల్లరి నరేష్ ప్రయత్నం చేస్తున్నాడనే టాక్ ఇప్పుడు తెరపైకి వచ్చింది.
కొద్ది రోజుల క్రితం అనుదీప్ ని ఇంటికి పిలిపించుకొని అల్లరి నరేష్ మాట్లాడినట్లు తెలుస్తుంది. అదే సందర్భంగా మంచి ఫన్ రైడ్ తో సాగిపోయే కథని సిద్ధం చేయమని కూడా అతనికి నరేష్ సూచించినట్లు టాక్ వినిపిస్తుంది.
అయితే అనుదీప్ మాత్రం విక్టరీ వెంకటేష్ కోసం కథ సిద్ధం చేసుకొని అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. ఈ నేపధ్యంలో అల్లరి నరేష్ కి అనుదీప్ ఒకే అని చెప్పి వచ్చేసినట్లు ప్రచారం నడుస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.