Begin typing your search above and press return to search.

కార్ వ్యాన్ లో వెళ్లి బాధపడ్డా : నరేష్

By:  Tupaki Desk   |   4 May 2023 12:42 PM GMT
కార్ వ్యాన్ లో వెళ్లి బాధపడ్డా : నరేష్
X
అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ఉగ్రం కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం ఒక రేంజ్ లో చేస్తున్నారు. నాందితో హిట్ అందుకున్న నరేష్ ఆ సినిమా దర్శకుడు విజయ్ తో చేసిన మరో అటెంప్ట్ ఉగ్రం. సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు అన్నీ ఉగ్రం మీద భారీ అంచనాలు ఏర్పరిచాయి. ఉగ్రం సినిమా తన కెరీర్ లో స్పెషల్ మూవీ అంటూ చెబుతున్నారు నరేష్.

ఇదివరకు నరేష్ అంటే ఒక కామెడీ హీరో అతన్ని నటుడి గా గుర్తించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నరేష్ కొన్ని సినిమాల్లో స్టార్ హీరోల స్పూఫ్ లు.. పేరడీలు చేస్తూ వచ్చాడు. ఆ టైం లో తను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యానని చెప్పారు నరేష్.

ఆ సీన్ చేయడం పూర్తయ్యాక కార్ వ్యాన్ లోకి వెళ్లి బాధపడ్డానని అన్నారు. అలాంటి సీన్స్ వల్ల తాను మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతాను తప్ప నటుడిని కాలేనని బాధపడ్డా కానీ అదంతా ఆడియన్స్ ని అలరించడం కోసమే ఏ హీరో ని ఇబ్బంది పెట్టాలని కాదని అన్నారు.

ఇక మీదట అలాంటి స్పూఫ్ లు చేయకూడదని ఫిక్స్ అయ్యానని అన్నారు అల్లరి నరేష్. ఉగ్రం సినిమా తనలో ఉగ్ర రూపాన్ని చూస్తారని చెప్పిన నరేష్ ఈ సినిమాతో పెద్ద టార్గెట్ నే పెట్టుకున్నాడు. నాంది హిట్ పడగానే నరేష్ ఇక మీదట తను కూడా ఇలాంటి సీరియస్ కథలనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఉగ్రం అంటూ రాబోతున్నాడు. ఉగ్రం లో నరేష్ 3 వేరియేషన్స్ లో కనిపిస్తారని తెలుస్తుంది.

సినిమాతో మలయాళ భామ మిర్నా హీరోయిన్ గా నటిస్తుంది. నరేష్ ఉగ్రం కి పోటీ గా గోపీచంద్ రామబాణం సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పరచుకోగా ఏ సినిమా సక్సెస్ అవుతుంది అన్నది చూడాలి.