Begin typing your search above and press return to search.

30 ఏళ్ల తర్వాత మరో కొమురం భీమ్‌

By:  Tupaki Desk   |   25 Oct 2020 12:30 AM GMT
30 ఏళ్ల తర్వాత మరో కొమురం భీమ్‌
X
తెలంగాణ గిరి పుత్రుడు.. విప్లవ వీరుడు కొమురం భీమ్‌ జీవిత చరిత్ర ఆధారంగా 1990లో అల్లాని శ్రీధర్‌ 'కొమురంభీమ్‌' అనే సినిమాను తెరకెక్కించాడు. అప్పట్లో అల్లాని శ్రీధర్‌ నంది అవార్డును దక్కించుకున్నాడు. మళ్లీ ఇప్పుడు కొమురం భీమ్‌ కథతో సినిమాను ఒక సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. హిందీ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు వెళ్లేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. దర్శకుడు అల్లాని శ్రీధర్‌ మరోసారి కొమురం భీమ్‌ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

గతంలో తెలుగులో మాత్రమే కొమురం భీమ్‌ సినిమాను చేసిన ఆయన ఈసారి పాన్‌ ఇండియా సినిమాగా భీమ్‌ జీవిత చరిత్రను రెడీ చేస్తున్నారు. ఒక వైపు రాజమౌళి కొమురం భీమ్‌ పేరుతో ఒక పాత్రను తన సినిమాలో చూపిస్తున్న నేపథ్యంలో మరో వైపు అల్లాని శ్రీధర్‌ పాన్‌ ఇండియా మూవీని ప్రకటించడంతో కొమురం భీమ్‌ గురించిన చర్చ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతోంది. కొమురం భీమ్‌ పాత్ర ఉంటుంది కాని ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కొమురం భీమ్‌ జీవితానికి సంబంధించి ఎలాంటి విషయాలను చూపించబోవడం లేదు. అల్లాని శ్రీధర్‌ మాత్రం కొమురం భీమ్‌ జీవితాన్ని ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు.