Begin typing your search above and press return to search.

అవార్డు సొంతం చేసుకోలేకపోయిన ఆల్ దట్ బ్రీత్స్

By:  Tupaki Desk   |   13 March 2023 1:06 PM GMT
అవార్డు సొంతం చేసుకోలేకపోయిన ఆల్ దట్ బ్రీత్స్
X
ఆస్కార్ అవార్డుల వేడుకలో ఈ రోజు భారతీయులు అందరూ గర్వంగా చెప్పుకునే రోజు అని చెప్పాలి. ఇద్దరు ఆడవాళ్ళు బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ తో అంతర్జాతీయ వేదికపై మెరిసి ఆస్కార్ అవార్డుని అందుకున్నారు. భారతీయ మహిళల సత్తా ఏంటో అనేది ఈ షార్ట్ ఫిల్మ్ ప్రూవ్ చేసింది. వారు అనుకుంటే ఎలాంటి అద్భుతాలు అయిన చేస్తారని ప్రూవ్ చేసింది.

ది ఎలిఫెంట్ విష్పరర్స్ షార్ట్ ఫిల్మ్. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట అవార్డుని సొంతం చేసుకుంది. ప్రతి తెలుగువాడు గర్వంగా దీనిని చూపించి మా నాటు పాటకి ప్రపంచం కట్టిన పట్టం ఇది అని చెప్పుకోవచ్చు. అలాగే తెలుగు సాహిత్యం యొక్క గొప్పతనం కూడా ఈ సాంగ్ తో అందరికి పరిచయం అయ్యింది. ఇదిలా ఉంటే ఈ వేడుకలలో ఇండియా నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆల్ దట్ బ్రీత్స్ అనే మూవీ కూడా నామినేట్ అయ్యింది.

అయితే ఫైనల్ గా దీనికి కొంత నిరాశ ఎదురైంది అని చెప్పాలి. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అవార్డుని రష్యాకి చెందిన నావల్నీ సొంతం చేసుకుంది. ఇక ఢిల్లీలో రోజు రోజుకి పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా మనుషులతో పాటు జంతువులు, పక్షులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నాయి అనే పాయింట్ తో షౌనక్ సేన్ ఈ సినిమాని తెరకెక్కించారు.

రష్యన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నావల్నీ డాక్యుమెంటరీ ఫిల్మ్ తెరకెక్కింది. ఈ రెండింటి మధ్య పోటీ నడవడగా అకాడమీ సభ్యులు రెండో సినిమాకి ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తానికి ఈ ఎడారి ఆస్కార్ వేడుకలలో రెండు సినిమాలతో ఇండియాకి గౌరవప్రదమైన స్థానం లభించగా ఆల్ దట్ బ్రీత్స్ చిత్ర యూనిట్ కి మాత్రం నిరాశ కలిగించింది అని చెప్పాలి. అయితే ఆస్కార్ ఫైనల్ పోటీల వరకు ఈ మూవీ వెళ్ళడం కూడా ఒక గొప్ప గౌరవంగా భావించాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.